కేసీఆర్, జగన్‌లది ఆంధ్రా ద్రోహుల ఫ్రంట్: నారా లోకేశ్

KTR meet YS jagan: టీఆర్ఎస్, వైఎస్ఆర్‌సీపీ దోస్తీపై టీడీపీ విమర్శల దాడి పెంచింది. నేతలు ఒక్కొక్కరుగా తమ స్టైల్లో కామెంట్లు పెడుతూ ఈ రెండు పార్టీల మైత్రిని ఎండగడుతున్నారు. తాజాగా ఏపీ మంత్రి, టడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

news18-telugu
Updated: January 16, 2019, 6:29 PM IST
కేసీఆర్, జగన్‌లది ఆంధ్రా ద్రోహుల ఫ్రంట్: నారా లోకేశ్
నారా లోకేశ్ (File)
  • Share this:
టీఆర్ఎస్, వైఎస్ఆర్‌సీపీ దోస్తీపై టీడీపీ విమర్శల దాడి పెంచింది. నేతలు ఒక్కొక్కరుగా తమ స్టైల్లో కామెంట్లు చేస్తూ ఈ రెండు పార్టీల మైత్రిని ఎండగడుతున్నారు. తాజాగా ఏపీ మంత్రి, టడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా ఈ అంశంపై స్పందించారు. తాము ఇన్నాళ్లు అనుకున్నదే నిజమైందని.. టీఆర్ఎస్, వైసీపీల చీకటి ఒప్పందం నేడు బహిర్గతం అయ్యిందని నారా లోకేశ్ అన్నారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన నారాలోకేశ్.. టీఆర్ఎస్, వైసీపీల స్నేహబంధంపై సెటైర్లు వేశారు. ఈ రెండు పార్టీల పొత్తుతో.. ఏపీపై కుట్రలు బయటపడ్డాయన్నారు. ఢిల్లీ మోదీ, ఆంధ్రా మోదీ, తెలంగాణ మోదీలు ఒక్కటయ్యారని లోకేశ్ ఎద్దేవా చేశారు. ముగ్గురూ కలిసి ఆంధ్రప్రదేశ్‌పై కుట్రలకు తెరలేపారని ఆరోపించారు. కేసీఆర్‌ను తెలంగాణ మోదీగా, నరేంద్ర మోదీని ఢిల్లీ మోదీగా, జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రామోదీగా అభివర్ణించారు లోకేశ్.

telangana cm kcr, kcr return gift to chandrababu, tdp fire on kcr return gift, ktr meets ys jagan, ap minister nara lokesh, nara lokesh tweet, YS Jagan mohan Reddy, ap special status, TRS KTR, cm kcr,jagan ktr meet, ysrcp trs friendship, Federal Front, వైసీపీ-టీఆర్ఎస్ దోస్తీ, సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కేటీర్-జగన్ భేటీ, ఏపీకి ప్రత్యేక హోదా,ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, ఏపీ మంత్రి నారా లోకేశ్, నారా లోకేశ్ ట్వీట్
జగన్‌తో భేటీ అయిన కేటీఆర్


ఈ సందర్భంగా కేసీఆర్ గతంలో ఆంధ్రావారి గురించి చేసిన వ్యాఖ్యలను పునరుద్ఘాటించారు లోకేశ్. ’లంకలో పుట్టినవాళ్లంతా రాక్షసులు, ఆంధ్రాలో పుట్టిన వాళ్లంతా వారి వారసులు. ఆంధ్రా బిర్యానీ పేడలా ఉంటుంది‘ అని అవహేళన చేసిన కేసీఆర్‌తో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జతకట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ys jagan ktr, ys jagan ktr meeting, jagan call ktr tarak, ys jagan mohan reddy, k chandrasekhar rao, ysrcp songs, trs party, జగన్ కేటీఆర్, కేటీఆర్ పేరు తారక్, వైఎస్సార్ సీపీ, టీఆర్ఎస్
జగన్ కేటీఆర్


విభజన చట్టం ప్రకారం అనేక అంశాల్లో ఏపీకి దక్కాల్సిన వాటాకు కేసీఆర్ అడుగడుగునా అడ్డుపడుతున్నారని విమర్శించారు. అలాంటి కేసీఆర్‌తో కలిసి జగన్ ఆంధ్రా ద్రోహుల ఫ్రంట్ ఏర్పాటు చేశారని ఎద్దేవా చేశారు. వారికి ప్రజలు తగిన బుద్ది చెబుతారని స్పష్టం చేశారు.ఇది కూడా చూడండి:

ఇది కూడా చూడండి:

Published by: Santhosh Kumar Pyata
First published: January 16, 2019, 6:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading