సీఎంను తిడుతుంటే ప్రధాని నవ్వుతారా? బీజేపీపై లోకేశ్ ఫైర్

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం టీడీపీ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా సాగుతోంది. నువ్వు ఒకటంటే, నేను రెండంటా.. అనే తీరుగా విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు నేతలు. తాజాగా కేంద్రప్రభుత్వ తీరుపై ఏపీ మంత్రి లోకేశ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

news18-telugu
Updated: January 5, 2019, 1:36 PM IST
సీఎంను తిడుతుంటే ప్రధాని నవ్వుతారా? బీజేపీపై లోకేశ్ ఫైర్
నారా లోకేశ్ (File)
  • Share this:
ప్రధాని నరేంద్ర మోదీ తీరు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టులా ఉందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఏపీ పట్ల అణచివేత ధోరణిని అవలంభిస్తున్నారని ఆరోపించారు. ఇది దేశానికి, ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. ట్విట్టర్ వేదికగా బీజేపీపై విమర్శలు గుప్పించిన లోకేశ్.. ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ, ఏపీ బీజేపీ నేతలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

హోదాకోసం చంద్రబాబునాయుడు, కేంద్రాన్ని నిలదీయడం తప్పా అని.. ఏపీ బీజేపీ నేతలను మంత్రి నారా లోకేశ్ ప్రశ్నించారు. ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ, ఏపీ బీజేపీ నేతలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ తీరుపై మండిపడ్డారు. వీడియో కాన్ఫరెన్స్‌లో భాగంగా రాష్ట్ర బీజేపీ నేతలు.. చంద్రబాబును అసభ్య పదజాలంతో దూషిస్తుంటే.. ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి నవ్వుతారా? అని ట్విట్టర్ వేదికగా నిలదీశారు. ఒక ముఖ్యమంత్రిని, తన పార్టీకి చెందిన నేతలు ఇష్టానుసారం తిడుతుంటే.. ఇన్నేళ్లు రాజకీయ అనుభవం ఉండి, ప్రధానిగా దేశానికి పెద్దన్నగా ఉండాల్సిన మోదీ.. నవ్వుతూ ఆస్వాదించడం దేనికి సంకేతమని ప్రశ్నించారు.


ఏపీ ఎదురు తిరిగితే అణచివేస్తాం అనే దోరణిలో ప్రదాని మోదీ వ్యవహరిస్తున్నారని.. అది దేశానికి, ప్రజాస్వామ్యానికి మంచిది కాదని లోకేశ్ అన్నారు. మోదీ తీరు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టులాంటిదన్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనపై కేంద్రం ఆంక్షలు విధించాలనుకోవడం పట్ల లోకేశ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశం కోసం ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలు ముఖ్యమైనట్టుగానే.. ఏపీ కోసం సీఎం చంద్రబాబు పర్యటనలు కూడా ముఖ్యమైనవన్నారు. మరి, ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనపై ఆంక్షలు విధించిన కేంద్రం.. ప్రధాని పర్యటనలపైనా షరతులు విధిస్తోందా? అని ప్రశ్నించారు.

First published: January 5, 2019, 1:36 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading