Home /News /politics /

AP MINISTER NARA LOKESH TO CONTEST FROM MANGALAGIRI SB

నారా లోకేష్ పోటీపై వచ్చిన క్లారిటీ... ఎక్కడినుంచంటే ?

నారా లోకేశ్ (ఫైల్ ఫోటో)

నారా లోకేశ్ (ఫైల్ ఫోటో)

దీంతో లోకేష్ తొలిసారి అసెంబ్లీ బరిలోకి దిగనున్నట్లు తెలుస్తుంది. అనేక సమీకరణాల తర్వాత మంగళగిరి నుంచి లోకేష్‌ను బరిలోకి దించాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం.

    ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ప్రధాన కార్యదర్శి, సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేశ్‌ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. తాజా ఎన్నికల్లో లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేస్తారని టీడీపీ అధిష్టానం క్లారిటీ ఇచ్చింది. దీంతో లోకేస్ తొలిసారి అసెంబ్లీ బరిలోకి దిగనున్నట్లు తెలుస్తుంది. అనేక సమీకరణాల తర్వాత మంగళగిరి నుంచి లోకేష్‌ను బరిలోకి దించాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం. గత కొన్ని రోజులుగా లోకేష్ పోటీ ఎక్కడ నుంచి అన్న వార్తాలకు ఎలాంటి సమాధానం ఇవ్వకుండానే.. టీడీపీ అధిష్టానం మాత్రం లీకులిస్తూనే ఉంది. భీమిలి నుంచి లోకేశ్‌ పోటీచేస్తారని ఒకసారి, విశాఖ నార్త్‌ నుంచి పోటీకి దిగనున్నారని మరోసారి లీకులు వదిలారు. తాజాగా మరికొందరి పేర్లు కూడా తెరపైకి తెచ్చారు. అసలు లోకేష్ పోటీ చేస్తారా లేదా అన్నదానిపై కూడా సందేహాలు వ్యక్తమయ్యాయి. ఎట్టకేలకు లోకేష్ పోటీ మంగళగిరి నుంచి అని క్లారిటీ ఇచ్చారు.

    First published:

    Tags: Andhra Pradesh Assembly Election 2019, AP Politics, Chandrababu naidu, Lok Sabha Election 2019, Nara Lokesh, Tdp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు