Home /News /politics /

AP MINISTER NARA LOKESH PROFILE SB

పరువు నిలబెడతాడా..ప్రత్యర్థిని పడగొడతాడా...? మంగళగిరిలో నారాలోకేష్ పరిస్థితేంటి ?

నారా లోకేష్ (File)

నారా లోకేష్ (File)

2013 మేలో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు కుమారుడి హోదాలో అధికారికంగా టీడీపీ తరఫున పనిచేయడం ప్రారంభించిన నారా లోకేష్.. 2004 ఎన్నికల కోసం టీడీపీ ప్రచార వ్యూహాల్లో పాలుపంచుకున్నారు.

  గత ఎన్నికలకు ముందు తండ్రి చాటు బిడ్డగా, మొహమాటంగా రాజకీయాల్లో అడుగుపెట్టిన నారా లోకేష్... దాదాపు నాలుగు దశాబ్దాల చరిత్ర  కలిగిన టీడీపీకి భవిష్యత్ ఆశాకిరణంలా కనిపిస్తున్నారు. సీఎంగా మూడో విడత పూర్తి చేసుకున్న చంద్రబాబు... మరోసారి గెలిస్తే కుమారుడికి పగ్గాలు అప్పజెప్పివిశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్న నేపథ్యంలో అడ్డంకులు కూడా లేకపోవచ్చు. ఈసారి ఎన్నికల్లో టీడీపీ అధికారం నిలబెట్టుకుంటే పార్టీలో లోకేష్ కు తిరుగులేని పరిస్ధితి క్రియేట్ చేయాలన్నది చంద్రబాబు వ్యూహంగా కనిపిస్తోంది. 2013 మేలో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు కుమారుడి హోదాలో అధికారికంగా టీడీపీ తరఫున పనిచేయడం ప్రారంభించిన నారా లోకేష్.. 2004 ఎన్నికల కోసం టీడీపీ ప్రచార వ్యూహాల్లో పాలుపంచుకున్నారు. లోకేష్ కు టీడీపీ పగ్గాలు కట్టబెట్టేందుకు పోటీ రాకుండా జూనియర్ ఎన్టీఆర్ ను పక్కనబెట్టారన్న విమర్శలు కూడా ఎదురైనా చంద్రబాబు వెనక్కి తగ్గలేదు. చంద్రబాబు, భుననేశ్వరికి ఏకైక సంతానం అయిన లోకేష్...
  ఎన్టీఆర్ మనుమడిగా, సినీ నటుడు బాలకృష్ణ అల్లుడుగానూ టీడీపీకి ఆశాకిరణంగా కనిపించారు. అటు తెలంగాణలో టీఆర్ఎస్ వ్యవహారాల్లో చురుగ్గా పనిచేస్తూ భవిష్యత్ తెలంగాణ సీఎంగా ఎదుగుతున్న కేటీఆర్ స్ఫూర్తితో ఏపీ రాజకీయాల్లో అడుగుపెట్టిన లోకేష్ కు టీడీపీలో చంద్రబాబు వారసుడిగా మంచి గౌరవమే దక్కింది.

  తొలుత పార్టీ వ్యవహారాలకే పరిమితమైన లోకేష్‌ ను... 2014లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక కేబినెట్ లో తీసుకోవాలన్న డిమాండ్లు పెరిగాయి. చంద్రబాబు మనసులో మాటను పార్టీ నేతలు కూడా డిమాండ్ల రూపంలో బయటపెట్డడంతో లోకేష్ ను తొలుత ఎమ్మెల్సీగా గెలిపించి అనంతరం కేబినెట్ లో తీసుకున్నారు. ఐటీ,పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలను తనయుడు లోకేష్ కు అప్పగించారు చంద్రబాబు.
  అప్పటికే పార్టీపై పట్టు కొనసాగించిన లోకేష్... కేబినెట్ లో చేరాక ప్రాధాన్యం మరింత పెరిగింది. చంద్రబాబుతో కలిసి విదేశీ పర్యటనలకు
  వెళ్లడం, ప్రభుత్వంలో కీలక నిర్ణయాల్లో భాగస్వామం తీసుకోవడం ప్రారంభించారు. గత ఐదేళ్లలో లోకేష్ కు తెలియకుండా ప్రభుత్వంలో ఏ కీలక నిర్ణయం తీసుకోలేదంటే నమ్మాల్సిన పరిస్ధితి. టీడీపీతో పాటు చంద్రబాబు ప్రభుత్వంపైనా పట్టు సాధించిన లోకేష్... భవిష్యత్తులో సీఎంగా కావాల్సిన అన్ని అర్హతలు తనకున్నాయని అటు పార్టీ నేతల్లోనూ నమ్మకం కలిగించగలిగారు. ఈసారి రాజధాని ప్రాంతం పరిధిలోకి వచ్చే మంగళగిరి నియోజకవర్గం నుంచి ప్రత్యక్ష ఎన్నికల బరిలో కూడా నిలిచారు.

  ఆరంభంలో ప్రత్యర్ధుల విమర్శలకు దీటుగా బదులివ్వలేకపోవడం, అన్నింటికీ తండ్రి చంద్రబాబుపై ఆధారపడిన లోకేష్... క్రమంగా
  మెరుగుపడ్డారు. అయితే విదేశాల్లో చదువుకున్న లోకేష్.. తెలుగు భాషపై ఇప్పటికీ పూర్తి పట్టు సాధించలేకపోవడం మైనస్ గా మారింది. పలు సందర్భాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తెలుగులో ఆయన ప్రసంగాల్లో దొర్లుతున్న తప్పిదాలు ప్రత్యర్ధులకు ఎన్నికల వేళ అస్త్రాలుగా మారుతున్నాయి. ప్రసంగాల పరిస్ధితి ఎలా ఉన్నా... తాను నిర్వహిస్తున్న ఐటీ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల్లో మాత్రం లోకేష్ పనితీరు మెరుగ్గానే ఉందని నివేదికలు చెప్తున్నాయి. ఘనచరిత్ర కలిగిన రాజకీయ కుటుంబ వారసుడిగా రాజకీయాల్లో అడుగుపెట్టినా.... ఎమ్మెల్సీగా గెలిచి మంత్రి అయిన లోకేష్ తీరు కూడా విమర్శలకు తావిచ్చింది. దీన్ని అధిగమించేందుకే అన్నట్లుగా ఈసారి మంగళగిరి అసెంబ్లీ సీటు నుంచి లోకేష్ ప్రత్యక్ష్య ఎన్నికల బరిలో నిలిచారు. ఇక్కడ ఆయన విజయం సాధిస్తే ప్రత్యర్ధులకు దీటైన జవాబు చెప్పే అవకాశముంటుంది.

  నారా లోకేష్ కెరీర్ లో మైలురాళ్లు:

  2007 బాలకృష్ణ కుమార్తె బ్రాహ్మణి తో వివాహం

  2013 మే నెలలో అధికారికంగా టీడీపీలో చేరిక

  2013 డిసెంబర్ నాటికి టీడీపీ ప్రచార వ్యూహాల్లో కీలక భాగస్వామ్యం

  2014 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరఫున ప్రచారం

  2014 మేలో ప్రభుత్వం ఏర్పాటులో కీలకపాత్ర-చంద్రబాబు కేబినెట్ సహచరులపై పట్టు

  2017 టీడీపీ ఎమ్మెల్సీగా విజయం

  2017 చంద్రబాబు కేబినెట్ లో చేరిక

  2018 స్కోచ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపిక

  2018 బిజినెస్ వరల్డ్ మ్యాగజైన్ డిజిటల్ లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు

  2018 కలాం ఇన్నోవేషన్ ఇన్ గవర్నెన్స్ అవార్డు

  2019 ఎన్నికల్లో మంగళగిరి అసెంబ్లీ నుంచి పోటీ
  (సయ్యద్ అహ్మద్, న్యూస్ 18 తెలుగు, సీనియర్ కరస్పాండెంట్)
  First published:

  Tags: Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, AP Politics, Chandrababu naidu, Nara Lokesh

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు