హోమ్ /వార్తలు /రాజకీయం /

మంగళగిరిలో మళ్లీ నోరుజారిన మంత్రి నారా లోకేష్

మంగళగిరిలో మళ్లీ నోరుజారిన మంత్రి నారా లోకేష్

నారా లోకేష్ (File)

నారా లోకేష్ (File)

గురువారం లోకేష్ పోటీకి దిగుతున్న గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా అక్కడున్న ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

    ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ మరోసారి నోరు జారారు. వైఎస్ వివేకా మరణ వార్త విని పరవశించా అని చెప్పిన లోకేష్ ఈసారి ఏకంగా ఎన్నికల పోలింగ్ తేదీనే తప్పుగా ప్రకటించారు. గురువారం ఆయన పోటీకి దిగుతున్న గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా అక్కడున్న ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అయితే ఏప్రిల్ 11న ఎన్నికలు జరుగుతుండగా...ఆయన మాత్రం ఏప్రిల్ 9న ఓటేయాలని బహిరంగ సభలో ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దీంతో ప్రజలంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. మరోవైపు నారా లోకేష్ చేసిన ఈ తప్పుడు ప్రకటన పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన నాయకులు విమర్శలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో లోకేష్ వీడియో పోస్ట్ చేసి సెటైర్లు పేలుస్తున్నారు.


    మరోవైపు ఈ వ్యవహారంపై మంగళగిరిలో లోకేశ్ పై పోటీ చేస్తున్న వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పందించారు. ట్విట్టర్‌లో ఆయన లోకేష్‌పై కామెంట్లు చేశారు. నారా లోకేష్ అభ్యర్థన మేరకు ప్రజలంతా టీడీపీకి ఏప్రిల్ 9న ఓటు వేయాలన్నారు. ఏప్రిల్ 11న మాత్రం వైసీపీ గుర్తు అయిన ఫ్యాన్‌కు ఓటేసి గెలిపించాలని కోరారు. #VoteForFan #TDPLosing’ అని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఈ ట్వీట్‌కి నారా లోకేశ్ మాట్లాడిన వీడియోను జతచేశారు.


    First published:

    Tags: Andhra Pradesh, AP News, AP Politics, Nara Lokesh, Tdp, Ysrcp

    ఉత్తమ కథలు