హోమ్ /వార్తలు /రాజకీయం /

రాయపాటికి లోకేష్ ఫోన్.. తొందరపడొద్దన్న యువనేత

రాయపాటికి లోకేష్ ఫోన్.. తొందరపడొద్దన్న యువనేత

లోకేశ్, రాయపాటి సాంబశివరావు

లోకేశ్, రాయపాటి సాంబశివరావు

ఏపీలో నేతలు పక్కచూపులు చూడడం.. పార్టీలకు ఇబ్బంది మారింది. దీంతో నేతలను కాపాడుకునేందుకు బుజ్జగింపుల పర్వానికి తెరలేపారు పార్టీ ప్రముఖులు. తాజాగా, నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు టీడీపీని వీడుతున్నారని ప్రచారం జరగడంతో పార్టీ అధినాయకత్వం రంగంలోకి దిగింది.

ఇంకా చదవండి ...

    ఏపీలో నేతలు పక్కచూపులు చూడడం.. పార్టీలకు ఇబ్బంది మారింది. దీంతో నేతలను కాపాడుకునేందుకు బుజ్జగింపుల పర్వానికి తెరలేపారు పార్టీ ప్రముఖులు. తాజాగా, నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు టీడీపీని వీడుతున్నారని ప్రచారం జరగడంతో పార్టీ అధినాయకత్వం రంగంలోకి దిగింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ రాయపాటితో ఫోన్‌లో మాట్లాడారు. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని సూచించారు. తప్పక న్యాయం జరుగుతుందని నచ్చజెప్పారు. నరసరావు పేట నుంచి ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్న రాయపాటి సాంబశివరావు ఈ సారి సీటు వచ్చే అవకాశం లేదని భావిస్తుండడంతో.. ఆయన అసంతృత్తితో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. తనకు నరసరావుపేట ఎంపీ సీటు, కుమారుడికి సత్తెనపల్లి ఎమ్మెల్యే సీటు కావాలని సాంబశివరావు చంద్రబాబును కోరారు. అయితే రెండింటిపైనా అధినేత నుంచి క్లారిటీ రాకపోవడంతో రాయపాటి వైసీపీ కండువా కప్పుకొనేందుకు సిద్ధమవుతున్నారనే ప్రచారం ఊపందుకుంది. దీంతో రంగంలోకి దిగిన మంత్రి నారా లోకేశ్.. రాయపాటికి ఫోన్ చేశారు. తగిన న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. దీంతో రాయపాటి కాస్త వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. అన్ని విధాలా ఆదుకుంటామనీ చెప్పారు.


    మరోవైపు, చంద్రబాబుతో తనకు మూడు దశాబ్దాలుగా మంచి అనుబంధం ఉందని రాయపాటి అన్నారు. తనకు కావాల్సిందేమిటో చంద్రబాబు చెప్పానని.. ఆయన తన కుటుంబానికి న్యాయం చేస్తారనే భరోసా ఉందని రాయపాటి చెప్పారు. తాజాగా, రాయపాటికి ఫోన్ చేసిన లోకేష్.. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని సూచించారు.

    First published:

    Tags: AP Politics, Nara Lokesh

    ఉత్తమ కథలు