ఊపులు, అరుపులకి ఎవరూ భయపడరు.. పవన్ కళ్యాణ్‌పై ఏపీ మంత్రి ఎదురుదాడి..

విశాఖ లాంగ్ మార్చ్‌లో పవన్ కళ్యాణ్

కారు డిక్కిలో కూర్చుని టీ తాగడం, ట్రైన్‌లో టాయిలెట్ పక్కన పుస్తకాలు చదవడం, వర్షంలో గొడుగు వేసుకుని ఆవులకు అరటిపళ్లు పెట్టడం వంటి డ్రామాలు ప్రజలు చూస్తున్నారని మంత్రి ఎద్దేవా చేశారు.

 • Share this:
  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు వదిలేసినా కూడా ఆ డైలాగ్‌లు వదల్లేదని ఏపీ మంత్రి కురసాల కన్నబాబు ఎద్దేవా చేశారు. అదే విధంగా డ్రామాలు చేస్తున్నారని సెటైర్ వేశారు. ఇసుక సమస్య మీద ఏపీ ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తున్న జనసేనానిపై కన్నబాబు విమర్శల దాడి చేశారు. ‘భారీ వరదలు, వర్షాల వల్ల ఇసుక తీయడం సాధ్యం కాలేదు. రాష్ట్రంలో కొంత ఇసుక కొరత ఉందన్న విషయం ప్రభుత్వానికి తెలుసు. కానీ సమస్యను అడ్డం పెట్టుకుని గుంటనక్కలా విపక్షం వ్యవహరిస్తోంది. టీడీపీ కష్టాల్లో ఉన్నప్పుడల్లా పవన్‌కళ్యాణ్‌ బయటకు వస్తారు. తాజాగా విశాఖలో లాంగ్‌ మార్చ్‌ పేరుతో షో చేశారు. ఒక్క అడుగు కూడా నడవకుండా వాహనంపై ఊరేగారు. పవన్‌ కళ్యాణ్‌ గతంలో ఏరోజైనా భవన నిర్మాణ కార్మికుల సమస్యల మీద గళం ఎత్తారా?. భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ నిధి కోసం గతంలో ‘ఛలో కాకినాడ’ చేపట్టినప్పుడు పవన్‌ కళ్యాణ్‌ వారికి ఎందుకు వారికి మద్దతు ఇవ్వలేదు?’ అని మంత్రి కన్నబాబు ప్రశ్నించారు.

  కురసాల కన్నబాబు (వ్యవసాయం)


  కారు డిక్కిలో కూర్చుని టీ తాగడం, ట్రైన్‌లో టాయిలెట్ పక్కన పుస్తకాలు చదవడం, వర్షంలో గొడుగు వేసుకుని ఆవులకు అరటిపళ్లు పెట్టడం వంటి డ్రామాలు ప్రజలు చూస్తున్నారని, చంద్రబాబు డైరెక్షన్‌లో ఈ డ్రామాలు చేస్తే.. వాటిని ఆపాలని కన్నబాబు హితవు పలికారు. ‘పవన్‌ కళ్యాణ్‌ 2 లక్షల పుస్తకాలు చదివానంటున్నారు. వాటిలో ఎక్కడైనా వరదల్లో ఇసుక ఎలా తీయాలని ఉంటే చెప్పండి. వెంటనే ప్రయత్నిస్తాం.’ అని కన్నబాబు అన్నారు. పవన్ కళ్యాణ్ ఊపులు, అరుపులకు ఎవరూ భయపడరని కన్నబాబు తేల్చి చెప్పారు.

  నక్క కోసం ఉచ్చుపెడితే పులి వచ్చి ఇరుక్కుంది

  Published by:Ashok Kumar Bonepalli
  First published: