నేను రాజశేఖర్ రెడ్డిలా చావాలనుకుంటున్నా... కొడాలి నాని సంచలన కామెంట్స్...

వైఎస్ఆర్ మరణం కనుక నాకొస్తే... నాకు ఆ మరణమే కావాలని దేవుడ్ని కోరుతానన్నారు కొడాలి. చనిపోయిన బతికున్నా అదృష్టం ఎంతమందికి వస్తుందన్నారు. వైఎస్ఆర్‌ది చాలా గొప్ప మరణమన్నారు.

news18-telugu
Updated: January 20, 2020, 5:29 PM IST
నేను రాజశేఖర్ రెడ్డిలా చావాలనుకుంటున్నా... కొడాలి నాని సంచలన కామెంట్స్...
కొడాలి నాని(ఫైల్ ఫోటో)
  • Share this:
అమరావతియే రాజదానిగా ఉండాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని భావిస్తే... 21మంది టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామలు చేయాలని సవాల్ విసిరారు ఏపీ మంత్రి కొడాలి నాని. మీరంతా రాజీనామా చేసి దమ్ముంటే ఎన్నికలకు వెళ్లాలన్నారు. పిచ్చి అరుపులు అరవకండి అంటూ టీడీపీ సభ్యులపై కొడాలి మండిపడ్డారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు ముందు కొడాలి నాని రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తారు. మేమంతా రాజీనామా చేస్తే వాళ్లు మిగులుతారా అంటూ ఎద్దేవా చేశారు.  రాజీనామాలు చేస్తే ఏం వస్తుందని ఆయన అప్పుడు అన్నారు.

సోషల్ మీడియాలో కొంతమందిని పోగేసి జగన్ కుటుంబాన్ని, ఆయన తండ్రిని విమర్శిస్తున్నారు. వైఎస్ఆర్ మరణం కనుక నాకొస్తే... నాకు ఆ మరణమే కావాలని దేవుడ్ని కోరుతానన్నారు కొడాలి. చనిపోయిన బతికున్నా అదృష్టం ఎంతమందికి వస్తుందన్నారు. వైఎస్ఆర్‌ది చాలా గొప్ప మరణమన్నారు. ఆయన చనిపోయినా ప్రజల గుండెల్లో బతికే ఉన్నారన్నారు. వైఎస్ఆర్ పేరుమీద పార్టీ స్థాపిస్తే... కడప జిల్లాలో డిపాజిట్లు కూడా ఇతర పార్టీకి దక్కుండా జగన్ మెజార్టీతో గెలిచారని గుర్తు చేశారు. వైఎస్ చేసిన కార్యక్రమాలే ఈరోజు జగన్‌ను గెలిపించారన్నారు. రాజశేఖర్ రెడ్డి మరణంపై విమర్శలు చేస్తున్నవారు సన్నాసులు. జగన్ మాట తప్పని, మడమ తిప్పని నాయకుడున్నారు. రాజధాని రైతులకు, మహిళలకు ఏమైనా అనుమానాలుంటే.. జగన్‌ను వచ్చి కలవాలన్నారు. ఆయనది ఎంతో పెద్ద మనసన్నారు. తప్పకుండా మీ కష్టాల్ని విని మీకు న్యాయ చేస్తారన్నారు కొడాలి నాని.
Published by: Sulthana Begum Shaik
First published: January 20, 2020, 5:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading