సభలో చంద్రబాబుకు చుక్కలు చూపిస్తున్న వంశీ, కొడాలి నాని

రెండో రోజు సమావేశాల్లో అసెంబ్లీకి రాగానే టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి వైసీపీ ఎమ్మెల్యేలు వెల్ కమ్ చెప్పారు. ఓ వైపు చూస్తే కొడాలి నాని, ఇంకొ వైపు చూస్తే వంశీ కన్పించేలా చంద్రబాబుని ఫిక్స్ చేశారన్నారు వైసీపీ ఎమ్మెల్యే శిల్పా.

news18-telugu
Updated: December 10, 2019, 11:43 AM IST
సభలో చంద్రబాబుకు చుక్కలు చూపిస్తున్న వంశీ, కొడాలి నాని
వల్లభనేని వంశీ, కొడాలి నాని (file Photos)
  • Share this:
ఇప్పటికే అధికారం కోల్పోయి చతికిలా పడ్డ చంద్రబాబు నాయుడుకు సొంత పార్టీలు, ప్రతిపక్షంలో కూడా కొరకరాని కొయ్యాల్లా తయారయ్యారు ఇద్దరు నేతలు. అందులో ఒకరు వల్లభనేని వంశీ కాగా మరొకరు మంత్రి కొడాలి నాని. దీనికి తాజాగా ఏపీలో జరుగుతున్న అసెంబ్లీ శీతకాల సమావేశాలే నిదర్శనంగా మారాయి. రెండో రోజు సమావేశాల్లో అసెంబ్లీకి రాగానే టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి వైసీపీ ఎమ్మెల్యేలు వెల్ కమ్ చెప్పారు. మొత్తానికి వంశీకి ప్రత్యేక గుర్తింపు వచ్చేసిందన్నారు వైసీపీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి. టీడీపీ అధినేత చంద్రబాబు ఎటూ తలతిప్పకుండా చేస్తున్నారన్నారు శిల్పా.

ఓ వైపు చూస్తే కొడాలి నాని, ఇంకొ వైపు చూస్తే వంశీ కన్పించేలా చంద్రబాబుని ఫిక్స్ చేశారన్నారు శిల్పా. మంత్రి కొడాలి, వంశీ కలిసి సభలో హీట్ పుట్టిస్తున్నారన్న మరో వైసీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున కూడా మాట్లాడారు.  దీనిపై మంత్రి కొడాలి స్పందిస్తూ అవకాశం ఇచ్చుంటే బయట మాట్లాడిన అంశాలే సభలో కూడా మాట్లాడి ఉండేవాడినన్నారు. మంగళవారం సభలో వంశీ చంద్రబాబుపై విమర్శలు చేశారు. ఆయన మాట్లాడటం ప్రారంభించగానే... చంద్రబాబు సభ నుంచి టీడీపీ సభ్యులతో పాటు బయటకు వెళ్లిపోయారు. ఆ తర్వాత కొడాలి నాని కూడా టీడీపీ సభ్యుల్ని ఓ ఆటాడుకున్నారు. అచ్చెన్నాయుడు, రామానాయుడుపై విమర్శలు గుప్పించారు.

First published: December 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>