బీజేపీలో జనసేన విలీనం.. మంత్రి సంచలన వ్యాఖ్యలు

జనసేన పార్టీని బీజేపీలో కలిపేందుకు పవన్ కల్యాణ్ సిద్ధమవుతున్నారు ఎదురుదాడి చేశారు. ఈ విషయం ఆయనే స్వయంగా చెప్పారని ఎద్దేవా చేశారు నాని.

news18-telugu
Updated: December 3, 2019, 9:25 PM IST
బీజేపీలో జనసేన విలీనం.. మంత్రి సంచలన వ్యాఖ్యలు
పవన్ కల్యాణ్, కొడాలి నాని
  • Share this:
బీజేపీ పెద్దలపై జనసేన అధినేత చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. సీఎం జగన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న పవన్ కళ్యాణ్.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై మాత్రం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశ రాజకీయాలకు మోడీ, అమిత్ షా వంటి వ్యక్తులే కరెక్ట్ అని, అలాంటి వారే ఉక్కుపాదంతో అణిచివేస్తారని ఆయన అన్నారు. ఆ భయం వైసీపీకి ఉందని, అందుకే వాళ్ళను చూసి భయపడుతున్నారని పేర్కొన్నారు. తిరుపతిలో కార్యకర్తలో సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. జనసేనాని కామెంట్స్ వ్యాఖ్యానించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

ఈ క్రమంలో పవన్ కళ్యాణ్‌పై ఎదురుదాడికి దిగారు ఏపీ మంత్రి కొడాలి నాని. రాయలసీమ ప్రాంతాన్ని కొన్ని గ్రూపులు కబ్జా చేశాయని, మెత్తగా మాట్లాడితే మనుషులు వినరని, ఉక్కుపాదంతో అణచివేస్తారంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు. జనసేన పార్టీని బీజేపీలో కలిపేందుకు పవన్ కల్యాణ్ సిద్ధమవుతున్నారు ఎదురుదాడి చేశారు కొడాలి నాని. ఈ విషయం ఆయనే స్వయంగా చెప్పారని ఎద్దేవా చేశారు. జనసేనను విలీనం చేయాలని అమిత్ షా అడిగారని గతంలో పవన్ వ్యాఖ్యానించారని నాని గుర్తు చేశారు. ఆ క్రమంలో పవన్ కల్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారని చురకలంటించారు.


First published: December 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>