చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని సంచలన ఆరోపణలు

చంద్రబాబు మాజీ పీఏ ఇంట్లో రూ. 2 వేల కోట్ల అక్రమ సంపాదనకు సంబంధించిన ఆస్తులు, నగదు, డాక్యుమెంట్ల వివరాలు దొరికాయని మంత్రి కొడాలి నాని ఆరోపించారు.

news18-telugu
Updated: February 18, 2020, 5:15 PM IST
చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని సంచలన ఆరోపణలు
చంద్రబాబు, కొడాలి నాని (File)
  • Share this:
ఏపీ మంత్రి కొడాలి నాని ఢిల్లీ పర్యటనలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ఆహార శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్‌ను అనంతరం మీడియాతో మాట్లాడిన కొడాలి నాని...చంద్రబాబు మాజీ పర్సనల్ సెక్రటరీ శ్రీనివాస్ ఇంట్లో జరిగిన ఐటీ దాడులపై తనదైన శైలి విమర్శలు గుప్పించారు. ఐటీ సోదాల్లో రూ.2 వేల కోట్ల క్యాష్ దొరికిందని ఎవరూ చెప్పలేదని కొడాలి నాని అన్నారు. రెండు వేల కోట్ల రూపాయలు పీఎస్‌ ఇంట్లో పెట్టుకోవడానికి చంద్రబాబు పిచ్చోడు కాదని వ్యాఖ్యానించారు. రెండు వేల కోట్ల రూపాయల క్యాష్ ఎవరూ ఇంట్లో పెట్టుకుని కూర్చోరని కొడాలి నాని అన్నారు.

రెండు వేల కోట్ల అక్రమ సంపాదనకు సంబంధించిన ఆస్తులు, నగదు, డాక్యుమెంట్లు సంబంధించిన వివరాలు దొరికాయని ఆరోపించారు. చంద్రబాబు చెప్పిన మేరకు డబ్బులు ఇచ్చిన విషయాన్ని పీఎస్ శ్రీనివాస్ తన డైరీలో రాసుకున్నారని విమర్శించారు. చంద్రబాబు చేసిన అక్రమాలకు శిక్ష తప్పదని కొడాలి నాని అన్నారు.

అంతకుముందు కేంద్రమంత్రి పాశ్వాన్‌తో చర్చించిన అంశాలను మంత్రి కొడాలి నాని వివరించారు. ఏపీకి ఎఫ్సీఐ నుంచి రావాల్సిన నాలుగు వేల కోట్లు ఇవ్వాలని కోరామని తెలిపారు. కేంద్రం ఏపీలో 92 లక్షల కార్డులను మాత్రమే గుర్తించిందని... మొత్తం కోటి 30 లక్షల కార్డులను గుర్తించాలని కోరినట్టు తెలిపారు. రేషన్ కార్డుల జారీ అనేది నిరంతర ప్రక్రియ అని మంత్రి వివరించారు. వన్ నేషన్ వన్ కార్డు కేంద్రం నిర్ణయిస్తే దాన్ని అమలు చేస్తామని తెలిపారు. దేశమంతా అమలు చేయాలని నిర్ణయిస్తే మనకు కూడా అవుతుందని కొడాలి నాని స్పష్టం చేశారు.First published: February 18, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు