news18-telugu
Updated: November 15, 2019, 8:11 PM IST
జూ ఎన్టీఆర్ (Twitter/Photo)
టాలీవుడ్ స్టార్ హీరో, నందమూరి హరికృష్ణ తనయుడు జూనియర్ ఎన్టీఆర్‌కు మాత్రమే టీడీపీని నడిపే సత్తా ఉందని ఏపీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన మంత్రి కొడాలి నాని... టీడీపీ బతకాలంటే నందమూరి వారసులకే పార్టీ అప్పగించాలని అన్నారు. అప్పుడే ఆ పార్టీకి మనుగడ సాధ్యమని అభిప్రాయపడ్డారు. 2009లో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం వల్లే టీడీపీకి ఆ మాత్రం సీట్ల వచ్చాయని అన్నారు. టీడీపీ యువనేత లోకేశ్‌పై మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. లోకేశ్ దద్దమ్మ అని అందరికీ తెలుసని... లోకేశ్ గురించి తెలుసు కాబట్టే అడ్డదారిలో అతడికి పదవులు కట్టబెట్టారని మండిపడ్డారు.

జూనియర్ ఎన్టీఆర్, కొడాలి నాని (ఫైల్ చిత్రం)
లోకేశ్ ప్రచారం చేస్తే అతనే గెలవలేకపోయాడని కొడాలి నాని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, లోకేశ్ టీడీపీని ముంచేయకుండా..జూనియర్ ఎన్టీఆర్‌కు పార్టీ పగ్గాలివ్వాలని కొడాలి నాని అన్నారు. అప్పుడే టీడీపీ కనీసం ప్రతిపక్షం లేదా పార్టీగా ఉంటుంది
Published by:
Kishore Akkaladevi
First published:
November 15, 2019, 8:07 PM IST