మన కమ్మోళ్లకి రెండు రాజధానులు... సభలో కొడాలి నాని సెటైర్లు

రాజధాని తరలిపోతుందని కమ్మ వర్గం వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు కొడాలి నాని.

news18-telugu
Updated: January 20, 2020, 4:34 PM IST
మన కమ్మోళ్లకి రెండు రాజధానులు... సభలో కొడాలి నాని సెటైర్లు
ఏపీ మంత్రి కొడాలి నాని
  • Share this:
రాజధాని విశాఖ తరలిపోతుందని టీడీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారన్నారు ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని. కమ్మవర్గాన్ని దెబ్బ తీయడానికే జగన్ రాజధానిని మారుస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతితో పాటు ఇప్పుడు విశాఖ కూడా రాజధానియే అన్నారు కొడాలి. వైజాగ్‌లో ఉన్న ఆస్తులు మావా అంటూ ఆయన ఎదురు ప్రశ్నించారు. విశాఖలో ఉన్న ఫైవ్ స్టార్ హోటల్స్, సినిమా థియేటర్లు, షోరూమ్‌లో అన్ని కమ్మకులానికి చెందినవారివేనని చురకలంటించారు మంత్రి. నారా లోకేష్ తోడల్లుడుకు విశాఖలో ఏకంగా పెద్ద విద్యాసంస్థే ఉందన్నారు.ఏదో కమ్మవారిని టార్గెట్ చేసి జగన్ రాజధానిని తరలించేస్తున్నారని చంద్రబాబు, ఆయన పత్రికలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అందుకే కమ్మ వర్గం వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. ఇకపై వారికి రెండు రాజధానులు ఉంటాయంటూ సెటైర్లు వేశారు కొడాలి. కులం మీద ద్వేషంతో జగన్ రాజధాని తరలిస్తున్నారనడం సరికాదన్నారు.

గుంటూరు, కృష్ణా జిల్లాలు ఎప్పటి నుంచో అభివృద్ధి చెందుతూ వస్తున్నాయన్నారు. ఇప్పుడు అమరావతి పేరుతో చంద్రబాబు అక్కడకొత్తగా అభివృద్ధి చేసిందేమి లేదన్నారు. కానీ ఉత్తరాంధ్ర ప్రజలు చాలా మంచివారన్నారు. నాలాంటి వాళ్లు కూడా వెళ్లి అక్కడ పోటీ చేసినా గెలిపిస్తారన్నారు కొడాలి. ఇప్పుడు చంద్రబాబు సింపతి కోసం జోలిపట్టినా ఎవ్వరూ పట్టించుకోరన్నారు. పాపాల భైరవుడు జోలి పట్టి డబ్బులు అడిగితే ఎవరూ ఆయనపై జాలిపడరన్నారు. చేసిన పాపాలకు తగిన శాస్తి జరిగిందంటూ సంతోషం వ్యక్తం చేస్తారన్నారు కొడాలి.

First published: January 20, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు