లోకేష్‌కు రాజకీయ బిక్ష పెట్టింది వైఎస్.. కొడాలి నాని లాజిక్ ఇదే..

లోకేష్‌కు చంద్రబాబు రాజకీయ బిక్ష పెట్టారని అందరు అనుకుంటారని.. కానీలో అందులో నిజం లేదన్నారు కొడాలి నాని. లోకేష్‌కు వైఎస్ రాజశేఖర్ రెడ్డే రాజకీయ భిక్ష పెట్టారని చెప్పుకొచ్చారు.


Updated: January 23, 2020, 4:48 PM IST
లోకేష్‌కు రాజకీయ బిక్ష పెట్టింది వైఎస్.. కొడాలి నాని లాజిక్ ఇదే..
కొడాలి నాని, నారా లోకేష్
  • Share this:
ఏపీ శాసనమండలిలో బుధవారం చోటుచేసుకున్న పరిణామాలపై తీవ్ర దుమారం రేగుతోంది. రాజధాని తరలింపు బిల్లులను ఛైర్మన్ షరీఫ్ సెలెక్ట్ కమిటీకి పంపించడంపై వైసీపీ నేతలు నిప్పులు చెరుగుతున్నారు. మండలిని టీడీపీ కార్యాలయంగా మార్చేశారని.. ప్రభుత్వ విధానాలకు అడ్డుపడుతున్న మండలి అసలు మనకు అవసరమా? అనే ప్రశ్నలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్‌పై మంత్రి కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోకేష్‌కు చంద్రబాబు రాజకీయ బిక్ష పెట్టారని అందరు అనుకుంటారని.. కానీలో అందులో నిజం లేదన్నారు కొడాలి నాని. లోకేష్‌కు వైఎస్ రాజశేఖర్ రెడ్డే రాజకీయ భిక్ష పెట్టారని చెప్పుకొచ్చారు.

''మా అందరికీ చంద్రబాబు రాజకీయ భిక్ష పెట్టాడని చెబుతాడు. కానీ లోకేష్‌కు రాజకీయ భిక్ష పెట్టిందెవరో తెలుసా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి. గారు. లేదంటే లోకేష్ లాంటి వాళ్లు చట్టసభలకు ఎప్పుడొచ్చేవారు. ఎన్టీరామారావు మండలిని రద్దుచేస్తే రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం మళ్లీ పునరుద్దరించింది. చట్టసభల్లో పెద్దలు ఉంటే బాగుటుందని ఆయన మండలిని తీసుకొచ్చారు. కానీ చంద్రబాబు చెత్తనంత తెచ్చి మండలిలో కూర్చోబెట్టారు. మండలి లేకుంటే లోకేష్ ఎమ్మెల్యే ఎప్పుడయ్యేవాడు..? చంద్రబాబు లోకేష్‌ని ఏమీ చేయలేడు. లోకేష్‌కి చట్టసభల్లో అవకాశం కల్పించి మంత్రిని చేసిన ఘనత వైఎస్‌కే దక్కుతుంది.'' అని కొడాలి నాని అన్నారు.

మండలిలో మేధావులు ఉంటే ప్రభుత్వానికి మంచి సలహాలు ఇస్తారని వైఎస్ భావించారని.. కానీ చంద్రబాబు మాత్రం చెత్తను తీసుకొచ్చి పెట్టారని విమర్శించారు నాని. శాసనమండలిలో ఎక్కువ మంది రాజకీయ నిరుద్యోగులు, రౌడీలు, గుండాలే ఉన్నారని ధ్వజమెత్తారు. తనలాంటి చదువుకోనోళ్లు ప్రజా బలంతో అసెంబ్లీలో ఉన్నామని.. ఇక మండలిలో కూడా చదువుకోనోళ్లే వెళ్తే లాభమేంటి? ప్రశ్నలు సంధించారు. కొడాలి నాని ప్రసంగం చేస్తున్న సమయంలో వైసీపీ సభ్యులు నవ్వుతూనే బల్లలు చరిచారు. సీఎం జగన్, స్పీకర్ తమ్మినేని సైతం నవ్వుతూ కనిపించాు.

First published: January 23, 2020, 4:45 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading