చంద్రబాబుకు ఏపీ మంత్రి కొడాలి నాని కౌంటర్

టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై మరోసారి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు మంత్రి కొడాలి నాని.

news18-telugu
Updated: August 16, 2019, 6:10 PM IST
చంద్రబాబుకు ఏపీ మంత్రి కొడాలి నాని కౌంటర్
చంద్రబాబు, కొడాలి నాని
  • Share this:
టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేత దేవినేని ఉమ ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడుతున్నారని ఏపీ మంత్రి కొడాలి నాని విమర్శించారు. చంద్రబాబు నివాసం సమీపంలో డ్రోన్ల వినియోగంపై టీడీపీ చేస్తున్న విమర్శలను కొడాలి నాని తీవ్రంగా తప్పుబట్టారు. వరదల పరిస్థితిని తెలుసుకోవడం కోసమే డ్రోన్‌ను వినియోగించారని ఆయన స్పష్టం చేశారు. ఇరిగేషన్ శాఖ అనుమతితోనే డ్రోన్లను వినియోగించారని వివరించారు. ఇందులో ఎలాంటి వివాదం లేదని అన్నారు. ప్రతి చిన్న విషయాన్ని టీడీపీ రాజకీయం చేయాలని చూస్తోందని కొడాలి నాని ఆరోపించారు.

అయినా డ్రోన్‌ను చూస్తే చంద్రబాబుకు ఎందుకంత భయమని కొడాలి నాని ప్రశ్నించారు. బాబు ఇంట్లో ఏమైనా అక్రమ వ్యవహారాలు సాగుతున్నాయా ? అని సెటైర్లు వేశారు. కృష్ణా నదికి వరదలొచ్చి ప్రాజెక్టులు నిండుతుంటే టీడీపీ నేతలకు నిద్రపట్టడం లేదని కొడాలి నాని విమర్శించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడైనా వరద వచ్చిందా అని ప్రశ్నించిన కొడాలి నాని... ఆయన సీఎంగా ఉన్న 14 ఏళ్లలో ఏనాడైనా ప్రాజెక్టుల గేట్లు ఎత్తారా ? అని వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలు ఇప్పటికైనా పనికిమాలిన ఆరోపణలు మానుకోవాలని సూచించారు.


First published: August 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>