జూనియర్ ఎన్టీఆర్ వల్లే... ఏపీ మంత్రి వివరణ

చంద్రబాబు, లోకేశ్‌పై ఏపీ మంత్రి కొడాలి నాని మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

news18-telugu
Updated: November 21, 2019, 6:15 PM IST
జూనియర్ ఎన్టీఆర్ వల్లే... ఏపీ మంత్రి వివరణ
జూనియర్ ఎన్టీఆర్, కొడాలి నాని (ఫైల్ చిత్రం)
  • Share this:
తనకు, వల్లభనేని వంశీకి రాజకీయ బిక్ష పెట్టింది జూనియర్ ఎన్టీఆరే అని ఏపీ మంత్రి కొడాలి నాని అన్నారు. తాను ఈ స్థాయిలో ఉన్నానంటే జూనియర్ ఎన్టీఆర్ కుటుంబమే కారణమని ఆయన వ్యాఖ్యానించారు. మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్‌పై కొడాలి నాని తీవ్ర విమర్శలు చేశారు. తాను తిరుమల వెంకటేశ్వరస్వామి భక్తుడినని వ్యాఖ్యానించిన కొడాలి నాని... శ్రీవారిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని అన్నారు. తాను చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యలు చేశానని... నీ అమ్మ మొగుడు ఖర్జూర నాయుడు కట్టించాడా అని అన్నానని తెలిపారు. ఆ వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని కొడాలి నాని స్పష్టం చేశారు.

ఏపీ సీఎం జగన్ తిరుమలకు వెళ్లడం ఇది మొదటిసారి కాదన్న కొడాలి నాని... దీనిపై చంద్రబాబు కావాలనే వివాదం సృష్టిస్తున్నారని కామెంట్ చేశారు. నారా లోకేశ్ పప్పు మాటలు మాట్లాడుతున్నాడని...లోకేశ్ లాంటి దద్దమ్మ వల్లే టీడీపీ నాశనం అవుతోందని మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.


First published: November 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...