అడిగినా కోడెలకు అపాయింట్‌మెంట్ ఇవ్వని చంద్రబాబు ?

కోడెల, చంద్రబాబు కాల్ డేటా పరిశీలీస్తే వాస్తవాలు బయటపడతాయన్నారు. కోడెల కేసులకు భయపడి ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాడు కాదన్నారు.

news18-telugu
Updated: September 17, 2019, 12:55 PM IST
అడిగినా కోడెలకు అపాయింట్‌మెంట్ ఇవ్వని చంద్రబాబు ?
కోడెల, చంద్రబాబు
  • Share this:
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతిపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి కొడాలి నాని.  అసెంబ్లీ ఫర్నిచర్ వ్యవహారంలో కోడెల, చంద్రబాబు తప్పు అంగీకరించారన్నారు. గతంలో కోడెల ఇంట్లో బాంబులు పేలినప్పుడు కేసు లు పెట్టింది చంద్రబాబు సర్కార్ అంటూ గుర్తు చేవారు. వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారినప్పుడు కోడెల పనిచేయకుండా అడ్డుకుంది చంద్రబాబే అన్నారు కొడాలి. పల్నాడులో తాజాగా టీడీపీ చేసిన ఆందోళనలకు పల్నాటి పులి అంటున్న కోడెలను ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. కోడెల పది రోజులు గా అడుగుతున్నా చంద్రబాబు అపాయింట్ మెంట్ ఇవ్వలేదని కొడాలి నాని ఆరోపించారు.

కోడెల పులి అయితే చంద్రబాబు నక్క అంటూ ఆయన ఎద్దేవా చేశారు. గతంలో ఎన్టీఆర్‌ను కూడా చంద్రబాబు ఇలాగే వేధించి చంపారన్నారు. కోడెలను వైసీపీ వేధిస్తోందని ఇప్పటివరకూ ఎందుకు చెప్పలేదన్నారు. కోడెల పై వేధింపులు జరుగుతుంటే టీడీపీ నేతలు ఎవరూ స్పందించలేదు ఎందుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం కోడెల కేసుపై నిష్పక్షపాతంగా, ఒత్తిళ్ళకు లొంగకుండా విచారణ జరపాలన్నారు. కోడెల, చంద్రబాబు కాల్ డేటా పరిశీలీస్తే వాస్తవాలు బయటపడతాయన్నారు. కోడెల కేసులకు భయపడి ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాడు కాదన్నారు.

చంద్రబాబుకు వ్యవస్థలను మేనేజ్ చేసే అలవాటు ఉందంటూ ఏపీ మంత్రి దుయ్యబట్టారు. అందుకే నిష్పక్షపాత విచారణ కోరుతున్నామన్నారు. కోడెల మరణం పల్నాడుకే కాదు రాష్ట్రానికే పెద్ద లోటు అన్నారు. కోడెల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కోడెలపై ప్రభుత్వం తనంతట తాను కేసులు పెట్టలేదన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకే కేసులు నమోదయ్యాయన్నారు. అయినా కోడెల కుటుంబ సభ్యులకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదన్నారు. కోడెల శివప్రసాదరావును వేధిస్తే పోరాటం చేసేవారు, కానీ ఆత్మహత్య చేసుకోరన్నారు. ఇప్పుడు కోడెల కుటుంబ సభ్యులను మేనేజ్ చేసేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని కొడాలి ఆరోపణలు గుప్పించారు.

First published: September 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>