పవన్ కళ్యాణ్‌కు చిరంజీవితో చెక్... తెరవెనుక ఏపీ మంత్రి...

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం జగన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సమయంలోనే చిరంజీవి జగన్ నిర్ణయాన్ని సమర్థించడం చర్చనీయాంశంగా మారింది. దీంతో మెగా ఫ్యామిలీలో మళ్లీ రాజకీయంగా విభేదాలు వచ్చాయా ? అనే చర్చ మొదలైంది.

news18-telugu
Updated: December 13, 2019, 5:02 PM IST
పవన్ కళ్యాణ్‌కు చిరంజీవితో చెక్... తెరవెనుక ఏపీ మంత్రి...
పవన్ కళ్యాణ్(ఫైల్ ఫోటో)
  • Share this:
మెగా ఫ్యామిలీలో విభేదాలు వచ్చాయని వార్తలు రావడం... అలాంటిదేమీ లేదని ఆ తరువాత వాళ్లు వివరణ ఇచ్చుకోవడం ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంది. అయితే తాజాగా మెగా హీరోలు చిరంజీవి, పవన్ కళ్యాణ్ మధ్య గ్యాప్ వచ్చిందనే టాక్ ఊపందుకుంది. పవన్ కళ్యాణ్ కాకినాడలో దీక్షకు దిగిన రోజే... దిశ చట్టం తీసుకొచ్చిన సీఎం జగన్‌ను అభినందిస్తూ చిరంజీవి ప్రకటన విడుదల చేశారు. ఓ వైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం జగన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సమయంలోనే చిరంజీవి జగన్ నిర్ణయాన్ని సమర్థించడం చర్చనీయాంశంగా మారింది. దీంతో మెగా ఫ్యామిలీలో మళ్లీ రాజకీయంగా విభేదాలు వచ్చాయా ? అనే చర్చ మొదలైంది.

సైరా సినిమా విడుదలైన తరువాత ఏపీ సీఎం జగన్‌ను తొలిసారి కలిశారు మెగాస్టార్ చిరంజీవి. అప్పటి నుంచి వైసీపీ చిరంజీవి పట్ల సానుకూలంగా ఉన్నట్టు కనిపిస్తోంది. అప్పట్లో ఏపీ మంత్రి, చిరంజీవికి సన్నిహితుల్లో ఒకరైన కన్నబాబు ఈ భేటీ వెనుక కీలక పాత్ర పోషించారనే వార్తలు వచ్చాయి. సైరా సినిమా స్పెషల్ షోలకు కూడా ఆయనే జగన్‌ను ఒప్పించి పర్మిషన్ ఇప్పించారనే ప్రచారం కూడా సాగింది.

Pawan kalyan, chiranjeevi, kannababu, ap minister kannababu, disha act, ap news, ap politics, janasena, ysrcp, పవన్ కళ్యాణ్, చిరంజీవి, కన్నబాబు, ఏపీ మంత్రి కన్నబాబు, దిశ చట్టం, ఏపీ న్యూస్, ఏపీ రాజకీయాలు, జనసేన, వైసీపీ
ఏపీ మంత్రి కన్నబాబు(ఫైల్ ఫోటో)


ఇక కొంతకాలంగా పవన్ కళ్యాణ్‌ను విమర్శించే విషయంలో దూకుడు ప్రదర్శిస్తున్న వైసీపీ నేతలు, మంత్రలు... చిరంజీవి కారణంగానే పవన్ కళ్యాణ్ ఈ స్థాయిలో ఉన్నారని పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. తాజాగా చిరంజీవి జగన్‌కు దిశ చట్టం విషయంలో మద్దతు ప్రకటించే విషయంలోనూ ఏపీ మంత్రి కన్నబాబు హస్తం ఉందనే ప్రచారం జరుగుతోంది. మొత్తానికి జగన్ నిర్ణయానికి అనుకూలంగా చిరంజీవి మాట్లాడేలా చేసిన ఏపీ మంత్రి... ఆ రకంగా పవన్ కళ్యాణ్‌కు షాక్ ఇచ్చారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

First published: December 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>