దేశంలో ఈ-కామర్స్‌కు డిమాండ్ పెరిగింది. ఆన్లైన్ ఆహార పదార్థాలు, పండ్లు, కూరగాయలు, వస్తువులు బుక్‌చేసుకొని ఇంటి వద్దకే తెప్పించుకున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సైతం రైతుల ఉత్పత్తుల కోసం ప్రత్యేక పోర్టల్‌ను రూపొందించింది. ఆంధ్రా గ్రీన్స్(andhragreens.com) పేరుతో వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. దీన్ని రాష్ట్ర వ్యవసాయ మంత్రి కన్నబాబు బుధవారం ప్రారంభించారు. ఆంధ్రాగ్రీన్స్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రైతుల నుంచి వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తుల మార్కెటింగ్ జరుగుతుందని ఆయన చెప్పారు. రైతులు తమ ఉత్పత్తులకు సంబంధించిన సమాచారాన్ని ఉంచటంతో పాటు వినియోగదారులు కూడా ఆన్లైన్ ద్వారా ఆర్డర్లు నమోదు చేసుకునే విధంగా దీన్ని రూపొందించినట్లు తెలిపారు.
కరోనా కారణంగా రైతుల ఉత్పత్తుల విక్రయాలకు ఇబ్బందులు వచ్చాయన్న ఆయన.. ఈ సమస్యను పరిష్కరించేందుకే ఆన్లైన్ మార్కెటింగ్ వ్యవస్థలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే స్విగ్గీ, జొమాటో ద్వారా పండ్లు, కూరగాయల విక్రయాలు జరుగుతున్నాయని.. ఇకపై ఆంధ్రా గ్రీన్స్ కూడా ఈ తరహా సేవలు అందిస్తుందన్నారు కన్నబాబు. కాగా, ఆంధ్రా గ్రీన్స్ వెబ్సైట్లో మామిడి, బత్తాయి, అరటి, దానిమ్మ పండ్లతో పాటు ఎండు మిర్చి, కారం, పసుపు వంటి ఆహార ఉత్పత్తులను కూడా హోమ్ డెలివరీ చేస్తారు. రైతుల నుంచి పండ్లు, కూరగాయలు, ఇతర ఉత్పత్తులను సేకరించి.. ప్రభుత్వం అప్రూవ్ చేసిన ప్యాక్ హౌస్‌లో ప్యాక్ చేస్తారు. అక్కడి నుంచి కస్టమర్లకు డెలివరీ చేస్తారు. ప్రస్తుతం ఈ సేవలు విజయవాడ, వైజాగ్, గుంటూరు, హైదరాబాద్, బెంగళూరు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.