• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • AP MINISTER DHARMANA KRISHNA DAS FIRES ON TDP LEADER ATCHANNAIDU AK

అవినీతి నిరూపిస్తే రాజీనామా... ఏపీ మంత్రి సవాల్

అవినీతి నిరూపిస్తే రాజీనామా... ఏపీ మంత్రి సవాల్

ధర్మాన కృష్ణదాస్(ఫైల్ ఫోటో)

తాను అవినీతికు పాల్పడినట్లు రుజువు చేస్తే తక్షణం మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మంత్రి ధర్మాన ధర్మాన కృష్ణదాస్ సవాల్ విసిరారు.

  • Share this:
    టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి అచ్చెన్నాయుడుపై ఏపీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ మండిపడ్డారు. తాను ఇసుక విషయంలో అవినీతికి పాల్పడినట్టు టీడీపీ అనవసర ఆరోపణలు చేసిందని ఆయన విమర్శించారు. తాను అవినీతికు పాల్పడినట్లు రుజువు చేస్తే తక్షణం మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మంత్రి ధర్మాన ధర్మాన కృష్ణదాస్ సవాల్ విసిరారు. టిడిపి ఎమ్మెల్యే అచ్చెనాయుడు తనపై చేసిన ఆరోపణలలో ఏది నిజం కాదని మంత్రి ధర్మాన కృష్ణదాస్ స్పష్టం చేశారు.శ్రీకాకుళం జిల్లా కల్లేపల్లిలో ఇసుక వారోత్సవాల్లో భాగంగా ఈరోజు ఇసుక రీచ్ ను ధర్మాన కృష్ణదాస్ ప్రారంభించారు.

    ఇసుక విషయంలో అవినీతికి పాల్పడ్డారంటూ అచ్చెన్న చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజల కోసం ముఖ్యమంత్రి జగన్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటే ప్రతిపక్ష నేతలు ఓర్వలేకపోతున్నారని ఆయన విమర్శించారు. వరదల వల్లే ఇసుక కొరత వచ్చిందని, ఇప్పడు సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని వివరించారు.

    ఇది కూడా చూడండి :
    Published by:Kishore Akkaladevi
    First published:

    అగ్ర కథనాలు