చంద్రబాబు హయాంలో అంతా గ్రాఫిక్సే... మండిపడ్డ ఏపీ మంత్రి

పేదలకు ఇళ్ల స్థలాలపై చంద్రబాబుది తప్పుడు ప్రచారం అని మంత్రి బుగ్గన ఆరోపించారు.

news18-telugu
Updated: June 5, 2020, 6:58 PM IST
చంద్రబాబు హయాంలో అంతా గ్రాఫిక్సే... మండిపడ్డ ఏపీ మంత్రి
వైసీపీ ప్రభుత్వ పథకాలన్నీ కొత్త సీసాలో పాత సారా వంటివే అని టీడీపీ అధినేత విమర్శించారు. టీడీపీ ప్రభుత్వ పథకాలకు, తండ్రీ కొడుకుల పేర్లు తగిలిస్తున్నారని.. సంపూర్ణ పోషణ చేసేవాళ్లైతే అన్నా కేంటిన్లు మూత వేస్తారా అని ప్రశ్నించారు.
  • Share this:
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మరోసారి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు హయాంలో గ్రాఫిక్స్‌లో ఇళ్లు కట్టారని ఎద్దేవా చేశారు. గత ఐదేళ్లలో చంద్రన్న ఫిల్మ్‌ నడిచిందని అన్నారు. ఆయన తన హయాంలో కేవలం 6.8లక్షల ఇళ్లు కట్టారని వ్యాఖ్యానించారు. పేదలకు ఇళ్ల స్థలాలపై చంద్రబాబుది తప్పుడు ప్రచారం అని మంత్రి బుగ్గన ఆరోపించారు. వైఎస్‌ హయంలో 21లక్షల ఇళ్లు నిర్మించారని, ఐదేళ్లలో 30లక్షల ఇళ్లు నిర్మించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ఏడాదికి రూ.80 వేల కోట్ల అప్పు తీసుకుందని మాజీమంత్రి యనమల రామకృష్ణుడు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని బుగ్గన అన్నారు. ఆయన అబద్ధాలు చెబుతున్నారని దుయ్యబట్టారు. అసత్యాలు చెబుతూ ప్రజల్ని గందరగోళానికి గురిచేస్తున్నారని టీడీపీపై మండిపడ్డారు. పెట్టుబడిలేని ట్విట్టర్‌ ఉంది కదా అని తప్పడు సమాచారం ఇవ్వొద్దని బుగ్గన సూచించారు. టీడీపీ నేత లోకేష్‌ తెలిసీ తెలియకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.
Published by: Kishore Akkaladevi
First published: June 5, 2020, 6:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading