'అమ్మఒడి'పై ఏపీ ప్రభుత్వం స్పష్టత...వాళ్లకు మాత్రమే రూ.15 వేలు

పిల్లలను బడికి పంపే తల్లులకు అమ్మఒడి పథకం కింద జనవరి 26న చెక్కులను పంపిణీ చేయాలని తొలి కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు.

news18-telugu
Updated: June 19, 2019, 9:49 PM IST
'అమ్మఒడి'పై ఏపీ ప్రభుత్వం స్పష్టత...వాళ్లకు మాత్రమే  రూ.15 వేలు
ఏపీ సీఎం జగన్ (File)
news18-telugu
Updated: June 19, 2019, 9:49 PM IST
'మీ పిల్లల్ని స్కూలుకు పంపిస్తే చాలు..ప్రతి ఏటా రూ.15 ఏపీ ప్రభుత్వం అందిస్తుంది.' మొన్న ప్రమాణస్వీకారం వరకు వైఎస్ జగన్ చెప్పిన మాట ఇది. పిల్లలను బడికి పంపే తల్లులకు అమ్మఒడి పథకం కింద జనవరి 26న చెక్కులను పంపిణీ చేయాలని తొలి కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. ఐతే ఈ పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం బుధవారం స్పష్టత ఇచ్చింది. ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లే విద్యార్థులకు మాత్రమే అమ్మఒడి పథకం వర్తిస్తుందని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టంచేశారు. వారికి మాత్రమే ఏటా రూ.15వేలు ఇస్తామని తెలిపారు. ప్రైవేట్ విద్యార్థులకు ఈ పథకాన్ని వర్తింపజేయడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు.

First published: June 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...