అమరావతిపై మంత్రి మాట... అన్నీ చెప్పి చివరకు...

గత ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేసిన మంత్రి బుగ్గన... రాజధాని భూములను ఇన్ సైడ్ ట్రేడింగ్ తరహాలో కొనుగోలు చేసి కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు.

news18-telugu
Updated: December 5, 2019, 4:14 PM IST
అమరావతిపై మంత్రి మాట... అన్నీ చెప్పి చివరకు...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అమరావతిపై ఏపీ ప్రభుత్వ వైఖరి ఏమిటనే విషయంపై ఇంకా ఓ క్లారిటీ రాలేదు. రాజధానిని అమరావతి నుంచి మార్చే అవకాశం లేదనే సంకేతాలు వస్తున్నా... రాజధాని నిర్మాణంపై మాత్రం సీఎం జగన్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఇక రాజధాని అంశంపై అధికార వైసీపీకి విపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉంటే తాజాగా అమరావతి ప్రాంతమైన తూళ్లురులో టీడీపీకి కౌంటర్‌గా రాజధాని రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పాల్గొన్నారు. రాజధాని పేరు చెప్పిన గత చంద్రబాబు ప్రభుత్వం ఏ రకంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిందనే దానిపై ఆయన రైతులకు వివరించారు.

గత ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేశారు. రాజధాని భూములను ఇన్ సైడ్ ట్రేడింగ్ తరహాలో కొనుగోలు చేసి కుంభకోణానికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. దీనిపై విచారణ కొనసాగుతోందని... అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని అన్నారు. అయితే దీనిపై అన్నీ చెప్పిన మంత్రి బుగ్గన... రాజధాని విషయంలో తమ ప్రభుత్వం ఏమీ చేయబోతోందనే అంశంలో మాత్రం క్లారిటీ ఇవ్వకపోవడం గమనార్హం. అయితే రాజధానిపై అందరికీ ఆమోదయోగ్యమైన ఓ రిజల్ట్ వస్తుందన్న మంత్రి బుగ్గన... దీనిపై కొనసాగుతున్న సస్పెన్స్‌ను కొనసాగించారు.


First published: December 5, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>