చిరంజీవికి ఎంపీ సీటుపై మంత్రి బొత్స రియాక్షన్

చిరంజీవికి రాజ్యసభ సీటు ఇవ్వబోతున్నారనే ప్రచారంపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు.

news18-telugu
Updated: February 15, 2020, 11:14 AM IST
చిరంజీవికి ఎంపీ సీటుపై మంత్రి బొత్స రియాక్షన్
చిరంజీవి(ఫైల్ ఫోటో)
  • Share this:
టాలీవుడ్ స్టార్ హీరో, కేంద్ర మాజీమంత్రి చిరంజీవి వైసీపీ తరపున రాజ్యసభకు వెళతారనే ప్రచారం కొంతకాలంగా సాగుతోంది. మరికొద్ది రోజుల్లో జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీకి దక్కబోయే నాలుగు స్థానాల్లో ఒకటి చిరంజీవికి దక్కుతుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. దీనిపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తనదైన శైలిలో స్పందించారు. చిరంజీవికి వైసీపీ తరపున రాజ్యసభకు పంపిస్తారనే వార్తలపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు మంత్రి బొత్స సూటిగా స్పందించలేదు. అయితే చిరంజీవికి తమ పార్టీ తరపున రాజ్యసభ సీటు ఇస్తున్నట్టు గానీ, ఇవ్వడం లేదని కానీ నేరుగా చెప్పలేదు.

పార్టీ ప్రయోజనాలకు అనుగూణంగా దీనిపై నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. అసలు వైసీపీ తరపున రాజ్యసభ రేసులో ఎవరు ఉన్నారనే దానిపై కూడా మంత్రి బొత్స సూటిగా సమాధానం ఇవ్వలేదు. తమ ప్రాధాన్యత జాబితాలో ఎవరున్నారనే విషయాన్ని ఇప్పుడే ఎలా చెబుతామని అన్నారు. మంత్రి బొత్స వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే... చిరంజీవికి రాజ్యసభ సీటు ఇచ్చే విషయంలో వైసీపీ ఆలోచన చేస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.


First published: February 15, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు