ఏపీ రాజధాని మారుతుందా..? మంత్రి బొత్స కీలక ప్రకటన..

Botsa Satyanarayana on AP Capital : కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా కేబినెట్ భేటీ నిర్వహించి.. అలాగే ప్రజాభిప్రాయాన్ని సేకరించి రాజధాని ఏర్పాటుపై ఒక నిర్ణయానికి వస్తామని మంత్రి బొత్స తెలిపారు.

news18-telugu
Updated: October 18, 2019, 8:59 AM IST
ఏపీ రాజధాని మారుతుందా..? మంత్రి బొత్స కీలక ప్రకటన..
బొత్స సత్యనారాయణ (File Photo)
news18-telugu
Updated: October 18, 2019, 8:59 AM IST
ఏపీలో వైసీపీ ప్రభుత్వం కొలువుదీరాక అమరావతిలో రాజధాని కొనసాగడంపై నీలి నీడలు కమ్ముకున్న సంగతి తెలిసిందే. గత ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటీ నివేదికను పరిగణలోకి తీసుకోకుండా రాజధాని ఏర్పాటుకు సిద్దపడిందని మంత్రి బొత్స సత్య నారాయణ బహిరంగంగానే విమర్శించారు. దీంతో రాజధాని ఏర్పాటుపై వైసీపీ ప్రభుత్వం పునరాలోచనలో ఉందన్న సంకేతాలు వెళ్లాయి. దానికి తగ్గట్టే చర్యలు మొదలుపెట్టిన ప్రభుత్వం తాజాగా ఓ కొత్త కమిటీని నియమించింది. ఈ విషయాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. కొత్తగా నియమించిన కమిటీ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి రాజధాని ఏర్పాటు.. ఏ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ది అవసరం అన్న అంశాలపై నివేదిక ఇస్తుందని తెలిపారు.

కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా కేబినెట్ భేటీ నిర్వహించి.. అలాగే ప్రజాభిప్రాయాన్ని సేకరించి రాజధాని ఏర్పాటుపై ఒక నిర్ణయానికి వస్తామని తెలిపారు. హైకోర్టును రాయలసీమలో పెట్టాలని అక్కడి ప్రజలు కోరుతున్నారని.. మరికొందరు ఉత్తరాంధ్రలో పెట్టాలంటున్నారని.. ఈ నేపథ్యంలో ప్రజా డిమాండ్లను కమిటీ పరిశీలించి నివేదిక ఇస్తుందని తెలిపారు. అభివృద్దిని వికేంద్రీకరించడం,రాష్ట్ర సమగ్రాభివృద్దే లక్ష్యంగా కమిటీ నివేదిక ఉంటుందని చెప్పారు.


గత ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటీ నివేదికను పట్టించుకోలేదని బొత్స విమర్శించారు. అప్పటి మంత్రి నారాయణ సిఫారసుతోనే అమరావతిలో రాజధాని ఏర్పాటు చేశారని మండిపడ్డారు. ప్రస్తుతం తాత్కాలిక సచివాలయం ఉన్న ప్రాంతంలో వర్షం పడితే ముంపుకు గురయ్యే అవకాశం ఉందన్నారు.ఇక్కడ భవనాలు నిర్మించాలన్నా 100 అడుగుల లోతు పునాదులు తవ్వాల్సి ఉంటుందని.. దానివల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని అభిప్రాయపడ్డారు. పైగా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఆ భవనాలు తట్టుకోవడం కష్టమన్నారు. కాబట్టి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని నిపుణుల కమిటీ నివేదిక అందజేస్తుందని చెప్పారు. మొత్తం మీద బొత్స చేసిన ప్రకటనతో ఏపీలో రాజధానిని మార్చే అవకాశాలు లేకపోలేదన్న అభిప్రాయాలు బలంగా వ్యక్తమవుతున్నాయి.
First published: October 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...