• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • AP MINISTER BOTSA SATYANARAYANA INTERESTING COMMENTS ON TOLLYWOOD DIRECTOR RAJAMOULI SB

ఆయనకు ఏం తెలుసు? రాజమౌళిపై బొత్స ఆసక్తికర వ్యాఖ్యలు

ఆయనకు ఏం తెలుసు? రాజమౌళిపై బొత్స ఆసక్తికర వ్యాఖ్యలు

మంత్రి బొత్స, రాజమౌళి

గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో రాజమౌళి వ్యవహారం ఒకటని బొత్స పేర్కొన్నారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం చల్లారడం లేదు. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ రాజధాని అమరావతి అంశంపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. విజయనగరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పలు ఆసక్తికర అంశాలపై మాట్లాడారు. గత ప్రభుత్వం హయాంలో దర్శకుడు రాజమౌళికి అమరావతి ఆర్కిటెక్చర్ రూపొందించే బాధ్యతలు అప్పగించడంపై బొత్స స్పందించారు. సినిమాల్లో రాజమౌళి చాలా గొప్పవాడు కావొచ్చు కానీ, రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలనేది ఆయనకు తెలియదన్నారు మంత్రి.

    దర్శకత్వంలో దాసరి తర్వాత రాజమౌళేనని, అందులో ఎలాంటి సందేహం లేదన్నారు బొత్స. కానీ ఏ జిల్లాను ఎలా అభివృద్ధి చేయాలి? రాష్ట్ర పరిస్థితులు ఏంటి అనే విషయాలు ఆయనకు తెలియవని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో రాజమౌళి వ్యవహారం ఒకటని బొత్స పేర్కొన్నారు. కానీ, సీఎం జగన్ అలా కాదని, రాష్ట్రానికి ఏది అవసరమో అదే చేస్తున్నారని స్పష్టం చేశారు. మొత్తం మీద రాజధాని అంశంపై బొత్స...డైరెక్టర్ రాజమౌళిపై కూడా విమర్శలు చేయడం .. రాజకీయవర్గాలతో పాటు.. సినీ వర్గాల్లో కూడా కలకలం రేపుతోంది.
    First published: