advertorial
Updated: November 25, 2019, 4:06 PM IST
బొత్స సత్యనారాయణ (File)
- Advertorial
- Last Updated:
November 25, 2019, 4:06 PM IST
మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. క్రొత్త ప్రభుత్వానికి కొంచెం ఒడిదుడుకులు ఉంటాయన్నారు. కాస్త టైం కావాలన్నారు బొత్స. ప్రతిపక్షాలు మాత్రం మొదటి రోజు నుండే ప్రభుత్వం పై దాడి చేస్తున్నాయని మండిపడ్డారు. రైతు భరోసా,ఇసుక, ఇంగ్లీష్ మాధ్యమం లాంటి అనేక విషయాల్లో తమపై విమర్శలు చేయడం తరువాత నాలుక కరుచుకోవడం చంద్రబాబుకే అలవాటే అన్నారు. మాతృభాష కు తామెప్పుడూ వ్యతిరేకం కాదన్నారు బొత్స. కేవలం ఆంగ్లభాష అవసరాన్ని మాత్రమే మేము గుర్తిస్తున్నామన్నారు. దీనిపై కూడా ప్రతిపక్షాలు తమ అనుకూల పత్రికల్లో విమర్శలు చేయిస్తున్నారన్నారు.
సామాన్యుడు ఇంగ్లీష్ లో చదువుకోవడం చంద్రబాబుకి నచ్చడం లేదన్నారు.
35 వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ అని తీసుకున్నారు మరి వాటిని ఎందుకు తన హయాంలో అభివృద్ధి చెయ్యలేదన్నారు. 5 ఏళ్ళు ముఖ్యంమంత్రిగా ఉండే వ్యక్తికి బాధ్యత ఉండక్కరలేదా అంటూ సెటైర్లు వేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అంటే 50 ఏళ్ళు పదవిలో ఉంటాను అనుకున్నారా? అని బొత్స ఎద్దేవా చేశారు. ల్యాండ్ పూలింగ్ నిబంధనలకు మేము కట్టుబడి ఉన్నామన్నారు. భూములు ఇచ్చిన రైతులకు ఇచ్చిన మాటకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. చంద్రబాబు ముందు రాజధాని ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు బొత్స. లక్ష కోట్ల బడ్జెట్ వేసి..4 వేలకోట్లు మాత్రమే రాజధానికి ఉపయోగించారని విమర్శలు చేశారు. ఇంతకంటే అన్యాయం ఉందా.?అంటూ నిలదీశారు.
2015 అక్టోబర్ లో ప్రధాని శంఖుస్థాపన చేస్తే అమరావతికి 3 ఏళ్లలో రూ. 4900 కోట్లు అంటే సంవత్సరానికి 1500 కోట్లు మాత్రమే ఊపయోగించారు. దీని ప్రకారం చూస్తే అసలు రాజధాని ఎప్పుటికి కడదామని అనుకున్నారు చంద్రబాబు.?అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు ఏమాత్రం బాధ్యత లేకుండా పాలన చేసి అమరావతిని ఓ స్మశానంలా మిగిల్చారన్నారు. రాజధాని కి రైతులకు G.O.ప్రకారం రావాల్సిన అన్ని హామీలు నెరవేర్చుతామని బొత్స హామీ ఇచ్చారు. పవన కళ్యాణ్ కి ఇవన్నీ కనిపిస్తున్నాయా? ఆయన కోరస్ లాగా మారాడంటూ జనసేనానిపై సైతం విమర్శలు గుప్పించారు బొత్స సత్యనారాయణ.
Published by:
Sulthana Begum Shaik
First published:
November 25, 2019, 4:06 PM IST