బీజేపీ అజెండాతో చంద్రబాబు.. టీడీపీపై ఏపీ మంత్రి అనుమానం

టీడీపీ నేతల విశాఖకు వచ్చే పెట్టుబడులపై తప్పుడు ప్రచారం చేశారని.. అధికారాన్ని అడ్డం పెట్టుకుని గతంలో పంచభూతాలను కూడా దోచుకున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు.

news18-telugu
Updated: September 26, 2020, 7:33 PM IST
బీజేపీ అజెండాతో చంద్రబాబు.. టీడీపీపై ఏపీ మంత్రి అనుమానం
చంద్రబాబునాయుడు
  • Share this:
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బీజేపీ అజెండాను చంద్రబాబు ఫాలో అవుతున్నారని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు.కులమతాల మధ్య చిచ్చుపెట్టి ప్రతిపక్ష నేత చంద్రబాబు లబ్ధిపొందే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సీఎం జగన్ తిరుమలలో ఎంతో దైవభక్తితో ఉన్నారని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. కొందరు కావాలని డిక్లరేషన్‌పై వివాదం సృష్టించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేరారు. అసలు ఆ వివాదం వల్ల ప్రజలకు ఏం ఉపయోగమని ప్రశ్నించారు. రాష్ట్రంలో మత కల్లోలాలు సృష్టించాలని చంద్రబాబు ఆరాట పడుతున్నారని బొత్స ఆరోపించారు.

టీడీపీ మాటలకు స్పందించాల్సిన అవసరం సీఎం జగన్‌కు లేదని స్పష్టం చేశారు. అమరావతి కుంభకోణం నిరూపించాలని గతంలో అనేకసార్లు డిమాండ్ చేసిన టీడీపీ.. విచారణకు ఆదేశిస్తే దాన్ని కోర్టుకి వెళుతోందని గుర్తు చేశారు. విశాఖ ప్రజలపై చంద్రబాబుకు ఎందుకంత ద్వేషమని మంత్రి బొత్స మండిపడ్డారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందొద్దని చంద్రబాబు కోరుకుంటున్నారని ఆరోపించారు. విశాఖను పరిపాలన రాజధాని చేస్తామంటే విషప్రచారం చేస్తున్నారని ప్రశ్నించారు. విశాఖ అభివృద్ధి దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనే జరిగిందని అన్నారు.

Chandrababu naidu news, botsa satyanarayana news, ap news, Amaravati news, tdp news, ysrcp news, చంద్రబాబు న్యూస్, బొత్స సత్యనారాయణ న్యూస్, అమరావతి న్యూస్, టీడీపీ న్యూస్, వైసీపీ న్యూస్
ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ(ఫైల్ ఫోటో)


టీడీపీ నేతల విశాఖకు వచ్చే పెట్టుబడులపై తప్పుడు ప్రచారం చేశారని.. అధికారాన్ని అడ్డం పెట్టుకుని గతంలో పంచభూతాలను కూడా దోచుకున్నారని ఆరోపించారు. దేవాలయాలపై దాడులు, దొంగతనాలు వెనుక ఎవరున్నా పట్టుకుని శిక్షిస్తామని మంత్రి బొత్స స్పష్టం చేశారు. తప్పు చేసినవారు శిక్ష అనుభవించక తప్పదని హెచ్చరించారు. ఈ దాడుల వెనుక టీడీపీ ఉందని మంత్రి బొత్స అనుమానం వ్యక్తం చేశారు. ఆ కోణంలోనూ విచారణ చేపట్టాలని రాష్ట్ర డీజీపీని కోరామని అన్నారు. గంటకొకటి మాట్లాడే రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదని మంత్రి బొత్స వ్యాఖ్యానించారు. చంద్రబాబు డ్రామాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్న బొత్స.. ఇకనైనా ఆయన ఊసరవెళ్లి రాజకీయాలు మానాలని సూచించారు.
Published by: Kishore Akkaladevi
First published: September 26, 2020, 7:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading