‘చంద్రబాబు, లోకేశ్‌ ఇళ్లపై ఐటీ దాడులు చేయాలి’

కాంట్రాక్టుల పేరుతో రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల అవినీతికి టీడీపీ పాల్పడిందని బొత్స అన్నారు.

news18-telugu
Updated: February 14, 2020, 4:54 PM IST
‘చంద్రబాబు, లోకేశ్‌ ఇళ్లపై ఐటీ దాడులు చేయాలి’
బొత్స సత్యనారాయణ (File Photo)
  • Share this:
చంద్రబాబు మాజీ పీఏ శ్రీనివాస్ నివాసంపై ఐటీ దాడులతో చంద్రబాబు అవినీతి చేశారనే విషయం స్పష్టమైందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. చంద్రబాబు, లోకేశ్ ఇళ్లపై కూడా ఐటీ దాడులు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీతో పాటు దేశవ్యాప్తంగా ఐటీ దాడులు జరిగాయని ఐటీ శాఖ ప్రకటించిందని బొత్స అన్నారు. కాంట్రాక్టుల పేరుతో రాష్ట్రంలో రూ. వేల కోట్ల అవినీతికి టీడీపీ పాల్పడిందని బొత్స అన్నారు. రాష్ట్రానికి కావాల్సింది అభివృద్ధి అని, అవినీతి కాదని బొత్స వ్యాఖ్యానించారు. రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని ఆయన మండిపడ్డారు. రివర్స్ టెండరింగ్‌ ద్వారా రూ. 3 వేల కోట్లకు పైగా ఆదా అయ్యిందని... ఇదంతా టీడీపీ దోచుకున్నట్టేగా అని బొత్స ఆరోపించారు.

తన మాజీ పీఎస్ అక్రమ లావాదేవీలపై చంద్రబాబు ఎందుకు నోరు మెదపడం లేదని బొత్స ప్రశ్నించారు. చంద్రబాబు అనుకూల మీడియా సైతం ఈ వార్తలను కవర్ చేయడం లేదని అన్నారు. చంద్రబాబు హయాంలో రూ.1 లక్షా 95వేల కోట్లు అప్పు చేస్తే...ఎక్కడెక్కడ ఖర్చు చేశారో చెప్పలేదని అన్నారు. అప్పులు తీసుకొచ్చి మరీ చంద్రబాబు దోచుకున్నారని బొత్స ఆరోపించారు. ప్రధాని ,సీఎం భేటీపై కూడా టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకే సీఎం జగన్ ప్రయత్నం చేస్తున్నారని మంత్రి బొత్స అన్నారు.


First published: February 14, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు