టీడీపీ అవినీతిని పవన్ కల్యాణ్ సమర్థిస్తున్నారా ?

జనసేన అజెండా మారలేదనీ, ద్వంద్వవైఖరి ఏంటో అర్థమవుతోందనీ అన్నారు. జనసేన తీరు చూస్తుంటే... అవినీతిని ప్రోత్సహిస్తున్నట్లు ఉందన్నారు

news18-telugu
Updated: September 2, 2019, 2:33 PM IST
టీడీపీ అవినీతిని పవన్ కల్యాణ్ సమర్థిస్తున్నారా ?
పవన్ కల్యాణ్(File)
  • Share this:
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను  పుట్టినరోజు కూడా వదల్లేదు వైసీపీ నేతలు. మరోసారి ఆయనపై ఏపీ మంత్రి బొత్స సత్యానారాయణ విమర్శలు గుప్పించారు. ఒక్క రాజధాని.. వెయ్యి కుంభకోణాలు అన్నట్లుగా రాష్ట్ర పరిస్థితి మారిందన్నారు బొత్స. కుంభకోణాల్లో చంద్రబాబు, లోకేష్‌ ప్రధాన నిందితులని ఆరోపించారు. జనసేన పవన్‌కల్యాణ్‌ మాట తీరు చూస్తుంటే టీడీపీ అవినీతిని ఆయన ప్రోత్సహిస్తున్నట్టున్నారని విమర్శించారు. రాజధాని ఒక ప్రాంతానికో, ఒక వర్గానికో చెందినది కాదని, ప్రభుత్వధనం దుర్వినియోగం కాకుండా చూడటం మా బాధ్యతన్నారు బొత్స.  వైఎస్ ఆశయాలను నెరవేర్చడం వైసీపీ లక్ష్యమన్నారు.  పోలవరాన్ని టీడీపీ ఏటిఎంలా వాడుకుందని సాక్షాత్తు దేశ ప్రధాని మోదీనే చెప్పారని గుర్తు చేశారు బొత్స.

రెండు రోజులుగా పవన్ కల్యాణ్ పై తనదైనశైలిలో విమర్శలు చేస్తున్నారు బొత్స. ఆదివారం మీడయాతో మాట్లాడుతూ బొత్స... ఇదివరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్... టీడీపీని ఏనాడూ ప్రశ్నించలేదన్నారు. ఎప్పుడూ వైసీపీ, జగన్‌నే ప్రశ్నించడాన్ని ప్రజలు చూశారన్నారు. గత ప్రభుత్వ అక్రమాల్ని తాము తవ్వితీస్తుంటే... తమనే పవన్ ప్రశ్నిస్తుండటం చూస్తుంటే... జనసేన అజెండా మారలేదనీ, ద్వంద్వవైఖరి ఏంటో అర్థమవుతోందనీ అన్నారు. జనసేన తీరు చూస్తుంటే... అవినీతిని ప్రోత్సహిస్తున్నట్లు ఉందన్నారు బొత్స.
First published: September 2, 2019, 2:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading