అమరావతిపై మంత్రి బొత్స ఆసక్తికర వ్యాఖ్యలు.. చంద్రబాబు భయం అదే?

Amaravati | శివరామకృష్ణన్ కమిటీ రిపోర్టును అప్పటి టీడీపీ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదని.. నారాయణ రిపోర్టును అమలు చేశారని బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు.

news18-telugu
Updated: August 23, 2019, 6:22 PM IST
అమరావతిపై మంత్రి బొత్స ఆసక్తికర వ్యాఖ్యలు.. చంద్రబాబు భయం అదే?
బొత్స సత్యనారాయణ, చంద్రబాబు
  • Share this:
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మీద మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికవర వ్యాఖ్యలు చేశారు. గతంలో ఆయన చేసిన కామెంట్స్ తీవ్ర దుమారానికి దారితీసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వైసీపీ - టీడీపీ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఓ దశలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లరావు అమరావతి నుంచి రాజధానిని తరలిస్తే ఆమరణ దీక్షకు కూడా సిద్ధమని ప్రకటించారు. ఈ క్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి అమరావతిపై స్పందించారు. రాజధానిపై తన వ్యాఖ్యలను వక్రీకరించారని అన్నారు. రాజధానిలో వరదల గురించే తాను మాట్లాడానన్నారు. శివరామకృష్ణన్ కమిటీ రిపోర్టును అప్పటి టీడీపీ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదని.. నారాయణ రిపోర్టును అమలు చేశారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారిలా మాట్లాడుతున్నారని, అమరావతి చుట్టూ టీడీపీ నేతలు రియల్ వ్యాపారం ఉంది కాబట్టే భయపడుతున్నారని బొత్స సత్యనారాయణ ఆరోపించారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ది జరగాలని, తద్వారా రూ.25లక్షల కోట్ల సంపదను సృష్టించబోతున్నామన్నారు. చెన్నై, ముంబైలు ఎప్పుడో నిర్మితమైన రాజధానులని, వాటితో అమరావతికి పోలిక ఏంటని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ముంపునకు గురవుతుందని తెలిస్తే అక్కడ రాజధానులు కట్టేవారా అని ప్రశ్నించారు. ఫోక్స్ వ్యాగన్ కేసులో తనను సాక్షిగా మాత్రమే పిలిచారని బొత్స చెప్పారు.

First published: August 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు