గుండెపోటా ? ఆత్మహత్యా ?.. కోడెల మృతిపై మంత్రి కీలక వ్యాఖ్యలు

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు

కోడెల మృతిపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కోరారు.

  • Share this:
    ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు మరణంపై సమగ్ర విచారణ జరగాలని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. కోడెల మరణంపై రాజకీయాలు చేయడం దురదృష్ణకరమని ఆయన వ్యాఖ్యానించారు. ఆయన కుటుంబ కలహాల వల్ల ఆత్మహత్య చేసుకున్నారా లేక ఇతర కారణాల వల్ల ఆత్మహత్య చేసుకున్నారా అన్నది తేలాల్సి ఉందని బొత్స అన్నారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలని కోరుతున్నానని వ్యాఖ్యానించారు. కోడెలపై బాధితులు పెట్టిన కేసులే తప్ప... ప్రభుత్వం నేరుగా కేసులు పెట్టలేదని స్పష్టం చేశారు.

    కోడెలపై నమోదైన కేసుల్లో ప్రభుత్వ ప్రమేయం లేదని మంత్రి బొత్స అన్నారు. ఆయన మరణంపై రకరకాల వార్తలు వస్తున్నాయని ఏపీ మంత్రి బొత్స తెలిపారు. సాక్ష్యాలు తారుమారు కాకుండా చూడాలని కోరారు. కోడెలది ముందు గుండెపోటన్నారని... ఆ తరువాత ఆత్మహత్య అంటున్నారని మంత్రి బొత్స అన్నారు. కోడెలను నిమ్స్‌ ఆస్పత్రి లేదా కేర్‌ ఆస్పత్రికి తీసుకెళ్లకుండా క్యాన్సర్ ఆస్పత్రికి తీసుకెళ్లారని బొత్స అన్నారు.
    First published: