అమరావతిపై క్లారిటీ ఇచ్చిన మంత్రి బొత్స

చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారిలా మాట్లాడుతున్నారని మంత్రి బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి చుట్టూ టీడీపీ నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది కాబట్టే వారంతా భయపడుతున్నారని అన్నారు.

news18-telugu
Updated: August 23, 2019, 6:20 PM IST
అమరావతిపై క్లారిటీ ఇచ్చిన మంత్రి బొత్స
అమరావతి ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తన వ్యాఖ్యలతో ఏపీ రాజధానిపై సరికొత్త ఊహాగానాలు చెలరేగేలా చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ... తాజాగా దీనిపై వివరణ ఇచ్చారు. విశాఖలో మీడియా ప్రతినిధులతో పిచ్చాపాటిగా మాట్లాడిన మంత్రి బొత్స... రాజధానిపై నా వ్యాఖ్యలు వక్రీకరించారని అన్నారు. రాజధాని విషయంలో గతంలోని చంద్రబాబు ప్రభుత్వం శివరామకృష్ణన్ రిపోర్టుని పరిగణనలోకి తీసుకోలేదని మాత్రమే తాను చెప్పానని బొత్స స్పష్టం చేశారు. రాజధాని విషయంలో వరదల గురించే తాను మాట్లాడనని వ్యాఖ్యానించారు. రాజధాని విషయంలో శివరామకృష్ణ రిపోర్ట్ కాకుండా నారాయణ రిపోర్టు అమలు చేశారని బొత్స కామెంట్ చేశారు.

చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారిలా మాట్లాడుతున్నారని మంత్రి బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి చుట్టూ టీడీపీ నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది కాబట్టే ఈ విషయంలో వారంతా భయపడుతున్నారని అన్నారు. రాజధానికి తాము వ్యతిరేకం కాదని... రాజధాని పేరుతో జరిగిన అవినీతికి మాత్రమే తాము వ్యతిరేకమని బొత్స వివరించారు. రాష్ట్రంలో కేవలం ఒక్క ప్రాంతం మాత్రమే కాకుండా... అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలని తాము కోరుకుంటున్నట్టు బొత్స స్పష్టం చేశారు. వరదలపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను మంత్రి బొత్స తప్పుబట్టారు. వోక్స్ వ్యాగన్ కేసు విషయంలో తనను కేవలం సాక్షిగా మాత్రమే పిలిచారని వివరించారు.






First published: August 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు