40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటే ఇదేనా చంద్రబాబు ?... మంత్రి బొత్స ఆగ్రహం

చంద్రబాబు, బొత్స సత్యనారాయణ(File)

టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి బొత్స తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

  • Share this:
    టీడీపీ తలపెట్టిన చలో ఆత్మకూరు కార్యక్రమం సందర్భంగా తలెత్తిన పరిణామాలపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రంగా స్పందించారు. రాష్ట్రం ప్రశాంతంగా ఉండటాన్ని చంద్రబాబు అస్సలు తట్టుకోలేకపోతున్నారని ఆయన ధ్వజమెత్తారు. చంద్రబాబుకు ఇలాంటి జిమ్మిక్కులు కొత్త కాదని విమర్శించారు. ఇకనైనా ఇలాంటి పిచ్చి వేషాలు మానుకోవాలని మంత్రి బొత్స సలహా ఇచ్చారు. ఏపీ సీఎం జగన్ వంద రోజుల పాలనలో అవినీతికి తావులేదని బొత్స అన్నారు. టీడీపీ నేతలు రాజకీయ నిరుద్యోగులుగా మారారని మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య సృష్టించేందుకు చంద్రబాబు, టీడీపీ నేతల ప్రయత్నిస్తున్నారని బొత్స ధ్వజమెత్తారు.

    టీడీపీ నేతలు ఎంతగా ప్రయత్నించినా వారి బుట్టలో తాము పడబోమని మంత్రి బొత్స వ్యాఖ్యానించారు. శాంతి భద్రతలను అదుపులోకి తీసుకొచ్చే క్రమంలో పోలీసులు చక్కగా పని చేశారని అన్నారు. సీఎం జగన్ కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతున్నారని... చంద్రబాబు మాత్రం ఇంకా తన పాత విధానాలు, కుట్రలతోనే ముందుకెళ్లాలని చూస్తున్నారని మంత్రి బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వాటిని తమ ప్రభుత్వం ఏ మాత్రం సహించదని అన్నారు.
    First published: