ఏం చేసినా విమర్శలేనా ?... చంద్రబాబుపై మండిపడ్డ మంత్రి బొత్స

రాష్ట్రానికి పెట్టుబడులు రావని టీడీపీ నేతలు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మంత్రి బొత్స ధ్వజమెత్తారు. పెట్టుబడుల పేరుతో తాము అవినీతిని ప్రొత్సహించబోమని అన్నారు.

news18-telugu
Updated: November 18, 2019, 5:21 PM IST
ఏం చేసినా విమర్శలేనా ?... చంద్రబాబుపై మండిపడ్డ మంత్రి బొత్స
చంద్రబాబు, బొత్స సత్యనారాయణ(File)
  • Share this:
పరస్పర అంగీకారంతోనే రాజధాని స్టార్టప్‌ ప్రాజెక్టు నుంచి సింగపూర్ కంపెనీ తప్పుకుందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ విషయాన్ని సింగపూర్ మంత్రి ఈశ్వరన్ స్వయంగా చెప్పారని అన్నారు. దీనిపై కొందరు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావని టీడీపీ నేతలు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మంత్రి బొత్స ధ్వజమెత్తారు. పెట్టుబడుల పేరుతో తాము అవినీతిని ప్రొత్సహించబోమని అన్నారు. తాము ఏం చేసినా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని మంత్రి బొత్స ఆరోపించారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఇసుక కొరత కూడా తీరుతోందని ఆయన వివరించారు.

పేదలు తమ పిల్లలు కాన్వెంట్‌ స్కూళ్లకు వెళ్లాలనుకుంటున్నారని, ఇంగ్లీష్‌ మీడియం అమలుపై ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయని మండిపడ్డారు. ప్రతిపక్షాలకు ధైర్యముంటే ఇంగ్లీష్‌ మీడియం అక్కర్లేదని చెప్పాలని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు.


First published: November 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...