ఆ రూ. 5 కోట్లు నావి కావు.. నిరూపిస్తే రాజకీయాలకు గుడ్ బై.. ఏపీ మంత్రి బాలినేని సవాల్

మాజీమంత్రి, టీడీపీ నేత లోకేష్ ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తున్నాడని ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విమర్శించారు.

news18-telugu
Updated: July 16, 2020, 5:17 PM IST
ఆ రూ. 5 కోట్లు నావి కావు.. నిరూపిస్తే రాజకీయాలకు గుడ్ బై.. ఏపీ మంత్రి బాలినేని సవాల్
బాలినేని శ్రీనివాస రెడ్డి(ఫైల్ ఫోటో)
  • Share this:
తమిళనాడులోని ఓ కారులో దొరికిన రూ. 5 కోట్లతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఈ అంశంలో టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని ఆయన మండిపడ్డారు. ఆ డబ్బు తనదే అని టీడీపీ నేతలు నిరూపిస్తే... తాను మంత్రి పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సవాల్ విసిరారు. నిన్న కేబినెట్ భేటీ అయిపోయిన తరువాత తనకు ఈ విషయం తెలిసిందని ఆయన వ్యాఖ్యానించారు. ఆ కారుపై తన పేరు మీద ఉన్న కేవలం జిరాక్స్ స్టిక్కర్ మాత్రమే అని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు.

మాజీమంత్రి, టీడీపీ నేత లోకేష్ ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తున్నాడని విమర్శించారు. ప్రజా జీవితంలో ప్రజలు తిరస్కరించిన వ్యక్తి లోకేష్ అని ఆరోపించారు. ఒక్కసారి కూడా నీ జీవితంలో ఎమ్మెల్యే గా గెలిచావా లోకేష్ ? అని ప్రశ్నించారు. తన రాజకీయ జీవితం గురించి మీ టీడీపీ నాయకులే చెబుతారని వ్యాఖ్యానించారు. తాను మచ్చలేని వ్యక్తిననని... తన గురించి తెలుసుకొని మాట్లాడాలని సూచించారు. జిరాక్స్ పెట్టుకొని వెళ్లిన కారు గురించి ఎస్పీకి ఫిర్యాదు చేశామని అన్నారు. టీడీపీ నాయకులు ఇలా మాట్లాడటానికి సిగ్గుండాలని మంత్రి బాలినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ ట్విట్టర్ తప్ప వేరే పని ఉండదని.. తనపై అనవసర ఆరోపణలు చేస్తే ప్రకాశం జిల్లాలోని టీడీపీ నేతలను క్లీన్ స్వీప్ చేసి చూపిస్తామని అన్నారు.
Published by: Kishore Akkaladevi
First published: July 16, 2020, 5:17 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading