లోకేశ్ కోసం రెండుసార్లు సర్వే... ఏపీ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

విశాఖకు వచ్చిన రైల్వే జోన్‌ను కూడా విజయవాడలో పెట్టాలని చంద్రబాబు ప్రయత్నించారని... కానీ అప్పట్లో ఎంపీగా ఉన్న తాను, విశాఖ మాజీ ఎంపీ అవంతి శ్రీనివాస్ దీన్ని అడ్డుకున్నామని అన్నారు.

news18-telugu
Updated: January 22, 2020, 1:25 PM IST
లోకేశ్ కోసం రెండుసార్లు సర్వే... ఏపీ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు
నారా లోకేష్ (ఫైల్)
  • Share this:
భీమిలిలో తనపై నారా లోకేశ్‌ను పోటీ చేయించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు రెండుసార్లు సర్వే చేయించారని ఏపీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ అన్నారు. అయితే ఆ సర్వేలో లోకేశ్ ఓడిపోతాడని తెలియడంతో చంద్రబాబు భయపడి వెనక్కి తగ్గారని వ్యాఖ్యానించారు. మండలిలో మాట్లాడిన మంత్రి అవంతి శ్రీనివాస్... చంద్రబాబు, లోకేశ్‌పై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు జపాన్, సింగపూర్ అంటే... లోకేశ్ అమెరికా అంటున్నారని మండిపడ్డారు. అయితే తాను శ్రీకాకుళం, విజయనగరం గురించి మాట్లాడుతున్నామని అన్నారు. గత ఐదేళ్లలో టీడీపీ ఎమ్మెల్యేలు భూ దోపిడీ చేశారని మంత్రి అవంతి ఆరోపించారు.

విశాఖకు వచ్చిన రైల్వే జోన్‌ను కూడా విజయవాడలో పెట్టాలని చంద్రబాబు ప్రయత్నించారని... కానీ అప్పట్లో ఎంపీగా ఉన్న తాను, విశాఖ మాజీ ఎంపీ అవంతి శ్రీనివాస్ దీన్ని అడ్డుకున్నామని అన్నారు. ఐదేళ్లలో ఉత్తరాంధ్రకు చంద్రబాబు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. చంద్రబాబు ఉత్తరాంధ్రకు అన్యాయం చేశారని... కాపులు ఉద్యమం చేస్తే... కేసులు పెట్టించారని మండిపడ్డారు.
Published by: Kishore Akkaladevi
First published: January 22, 2020, 1:25 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading