నాతో పెట్టుకుంటే విశాఖలో ఉండలేవు...గంటాకు మంత్రి వార్నింగ్

తనతో పెట్టుకోవద్దంటూ గంటా శ్రీనివాసరావుకు మంత్రి అవంతి శ్రీనివాసరావు వార్నింగ్ ఇచ్చారు. నెల్లూరు మెస్‌లో టికెట్లు అమ్ముకున్న నీ బాగోతం తనకు తెలుసంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

news18-telugu
Updated: September 2, 2019, 12:52 PM IST
నాతో పెట్టుకుంటే విశాఖలో ఉండలేవు...గంటాకు మంత్రి వార్నింగ్
అవంతి శ్రీనివాస్, గంటా శ్రీనివాసరావు
  • Share this:
టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావుపై టూరిజం శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు ఘాటు వ్యాఖ్యలు చేశారు.  అవంతిని ఒక మంత్రిగా తాను పరిగణించడం లేదని నిన్న మీడియాతో మాట్లాడుతూ గంటా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గంటా కామెంట్స్‌పై తాజాగా మంత్రి అవంతి శ్రీనివాసరావు మండిపడ్డారు. నన్ను మంత్రి కాదన్న గంటా శ్రీనివాసరావు నిజంగానే మనిషేనా? అని ఘాటుగా స్పందించారు.  తెలుగుదేశం పార్టీలో అయ్యన్నపాత్రుడుని అణగదొక్కేందుకు గంటా వచ్చారంటూ విమర్శలు గుప్పించారు.  తాను అయ్యన్నపాత్రుడంత మంచివాడిని కాదన్నారు. తన జోలికి వస్తే గంటాను విశాఖలో ఉండకుండా చేసే శక్తి తనకుందంటూ సవాల్ చేశారు.

తనతో పెట్టుకోవద్దంటూ గంటా శ్రీనివాసరావుకు వార్నింగ్ ఇచ్చారు. నెల్లూరు మెస్ లో టికెట్లు అమ్ముకునే బాగోతం తనకు తెలుసనంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. నేను నోరు తెరిస్తే నీ బండారం బయటబడుతుందంటూ విమర్శలు గుప్పించారు. విజయనగరం జిల్లా ఇన్చార్జి గా ఉండి ఏం  సాధించావంటూ గంటాను అవంతి ప్రశ్నించారు. ఒక్క ఎమ్మెల్యే ని గెలిపించుకోలేక పోయావంటూ మండిపడ్డారు. నిన్ను చంద్రబాబు నాయుడు పార్టీ లో ఉంచుకోవడం పెద్ద తప్పంటూ విరుచుకపడ్డారు. రేపు  చంద్రబాబుకు కూడా సున్నం రాసే స్థాయి నీదంటూ ఆరోపణలు చేశారు.

గంటా చరిత్ర భూకబ్జా కోరు చరిత్ర అంటూ మంత్రి మండిపడ్డారు. అలాంటి దొంగని జగన్ ఏనాడు తమ పార్టీలోకి తీసుకోరన్నారు. నీ లాంటి వాడిని తీసుకొని వైఎస్ఆర్సీపీ పరువు తీసే స్థాయిలో సీఎం జగన్ లేరన్నారు. జగన్, బొత్స సత్యనారాయణ గురించి మాట్లాడే స్థాయి గంటా శ్రీనివాసరావుది కాదన్నారు మంత్రి అవంతి. వర్గ రాజకీయాలు గ్రూపు రాజకీయాలు చేస్తే చరిత్ర గంటాది అంటూ మాటల దాడికి దిగారు.
First published: September 2, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading