పదిమంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు... టీడీపీపై మంత్రి సంచలన వ్యాఖ్యలు

జగన్ ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడు చేరతామంటూ పదేపదే తమకు చెప్తున్నారని తెలిపారు. సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే... వాళ్లంతా పార్టీ మారేందుకు సిద్దంగా ఉన్నారంటూ వ్యాఖ్యలు చేశారు మంత్రి.

news18-telugu
Updated: August 14, 2019, 8:08 AM IST
పదిమంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు... టీడీపీపై మంత్రి సంచలన వ్యాఖ్యలు
టీడీపీ ఎన్నికల గుర్తు
news18-telugu
Updated: August 14, 2019, 8:08 AM IST
ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశంపై అవకాశం చిక్కినప్పుడల్లా అధికార పార్టీ నేతలు విమర్శల దాడికి దిగుతున్నారు. తాజాగా ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్... టీడీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనతో పదిమంది టీడీపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారన్నారు. జగన్ ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడు చేరతామంటూ పదేపదే తమకు చెప్తున్నారని తెలిపారు. సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే... వాళ్లంతా పార్టీ మారేందుకు సిద్దంగా ఉన్నారంటూ వ్యాఖ్యలు చేశారు. జగన్ డోర్స్ లాక్ చేశారు కాబట్టే... తెలుగుదేశం పార్టీ బతికిపోయిందన్నారు అవంతి. లేకపోతే పార్టీ ఎప్పుడో ఖాళీ అయ్యేదన్నారు.

ప్రస్తుతం టచ్ లో ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు వచ్చేస్తే మిగిలిన వారు కూడా వైసీపీలోకి వచ్చేందుకు  క్యూ కట్టేవారంటూ మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ తెలుగురాష్ట్రాల్లో తుడుచుపెట్టుకు పోతుందని జోస్యం చెప్పారు మంత్రి. టీడీపీ బతికిబట్టకట్టగలిగే ప్రసక్తే లేదని మంత్రి అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన తప్పులను, అవినీతిని బయటకు తీస్తామని హెచ్చరించారు.

First published: August 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...