హోమ్ /వార్తలు /రాజకీయం /

చేతులెత్తి నమస్కరిస్తున్నా... చంద్రబాబుకు ఏపీ మంత్రి విజ్ఞప్తి

చేతులెత్తి నమస్కరిస్తున్నా... చంద్రబాబుకు ఏపీ మంత్రి విజ్ఞప్తి

అవంతి శ్రీనివాస్, చంద్రబాబు(ఫైల్ ఫోటోలు)

అవంతి శ్రీనివాస్, చంద్రబాబు(ఫైల్ ఫోటోలు)

వైజాగ్ బ్రాండ్ ఇమేజ్‌ని దెబ్బతీయాలని చూస్తూ చరిత్ర మిమ్మల్ని క్షమిచందన్నారు అవంతి శ్రీనివాస్. ఉత్తరాంధ్రకు చెందిన నేతలు అమరావతికి వ్యతిరేకం కాదని.. రాష్ట్రంలోని అన్ని అభివృద్ధినే తాము కోరుకుంటున్నామని తెలిపారు.

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడిపై మంత్రి అవంతి శ్రీనివాస్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏపీ భవిష్యత్ రాజధాని విశాఖపట్టణం బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే విధంగా టీడీపీ నేతలు విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. రాజధానిపై జీఎన్ రావు కమిటీ సమర్పించిన నివేదికను వక్రీకరిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన విరుచుకుపడ్డారు. వికేంద్రీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా మండలిలో చంద్రబాబు వ్యవహరించిన తీరును రాష్ట్ర ప్రజలంతా చూశారని.. ఆయన అభివృద్ధి మూడు గ్రామాలకే పరిమితమైందని ధ్వజమెత్తారు అవంతి శ్రీనివాస్. ఏపీ పరిపాలనా రాజధానిగా వైజాగ్ అనువైన నగరమని.. రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు విశాఖ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని ధ్వజమెత్తారు. వైజాగ్ బ్రాండ్ ఇమేజ్‌ని దెబ్బతీయాలని చూస్తూ చరిత్ర మిమ్మల్ని క్షమిచందన్నారు అవంతి శ్రీనివాస్. ఉత్తరాంధ్రకు చెందిన నేతలు అమరావతికి వ్యతిరేకం కాదని.. రాష్ట్రంలోని అన్ని అభివృద్ధినే తాము కోరుకుంటున్నామని తెలిపారు. 'చేతులెత్తి నమస్కరిస్తున్నా'.. దయచేసి విశాఖపట్టణంపై విషం చిమ్మొద్దని చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు.

First published:

Tags: Amaravati, Avanthi srinivas, Chandrababu naidu, Visakhapatnam, Vizag

ఉత్తమ కథలు