హైకోర్టు తీర్పుపై ఏపీ మంత్రి అనిల్ ఆనందం

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు.

news18-telugu
Updated: November 1, 2019, 3:53 PM IST
హైకోర్టు తీర్పుపై ఏపీ మంత్రి అనిల్ ఆనందం
ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్
  • Share this:
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పు ఆహ్వానించదగిందన్నారు. పోలవరంలో హైడల్ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి తమను తప్పించడంపై నవయుగ సంస్థ దాఖలు చేసిన పిటిషన్ మీద స్టే ఎత్తివేసిన హైకోర్టు.. ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిపై ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. పోలవరం పనులు ఈ రోజు ప్రారంభం అవుతాయన్నారు. ప్రతిపక్షాలు ఎన్నో అడ్డంకులు సృష్టించాయని, దీనిపై ఎన్ని అవాంతరాలు వచ్చినా అనుకున్న సమయంలో పూర్తి చేస్తామని ప్రకటించారు. పోలవరంతో పాటు అన్ని ప్రాజెక్ట్ లు నిర్దేశిత సమయంలో పూర్తి చేస్తామన్నారు.

‘ప్రతిపక్షంతో పాటు మరో రెండు పార్టీలు ఎదో హడావుడి చేస్తున్నాయి. సీఎం నిర్ణయంతో రివర్స్ టెండర్ ద్వారా 800 కోట్లు ఆదా చేసి చూపించాం. 2021 జూన్ లోపు పోలవరం పూర్తి చేయగలమని అధికారులు అంచనా వేశారు. ఏ పనులు పూర్తి చేయకుండా 70 శాతం చేశామని ప్రకటించి చంద్రబాబు మోసం చేశారు. మూడేళ్లపాటు నిద్రపోయారు.. చివరి రెండేళ్లలో స్పిల్ వే కట్టి అంతా చేసేసామని గొప్పలు చెప్పారు.’ అని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.

పెళ్లిలో డీజే గొడవ.. కొట్టుకున్న బంధువులుFirst published: November 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>