జగన్‌ను చూస్తే బాబుకు ఉలుకెందుకు..? రివర్స్ టెండరింగ్‌పై మంత్రి అనిల్ కీలక వ్యాఖ్యలు

Polavaram Reverse Tendering : పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం మొత్తం రూ.55వేల కోట్లు అయితే.. ఇంకా రూ.32వేల కోట్లు పని మిగిలే ఉందని..జరిగిన పనిలోనూ ఎక్కువ శాతం వైఎస్ హయాంలోనే జరిగిందన్నారు.

news18-telugu
Updated: September 21, 2019, 11:37 AM IST
జగన్‌ను చూస్తే బాబుకు ఉలుకెందుకు..? రివర్స్ టెండరింగ్‌పై మంత్రి అనిల్ కీలక వ్యాఖ్యలు
టీడీపీ నేతలే సీబీఐ విచారణ జరిపించాలని కోరారని మంత్రి అనిల్ అన్నారు. టీడీపీ పెద్దలు రాజధాని గ్రామాల్లో భూములు కొనుగోలు చేశారని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వమే అమరావతి భూముల వ్యవహారంలో ఇన్‌సైడ్ ట్రేడింగ్ ప్రొత్సహించిందని అన్నారు.
  • Share this:
పోలవరం ప్రాజెక్ట్ రివర్స్ టెండరింగ్‌ పారదర్శకంగా నిర్వహిస్తున్నామని సాగునీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. మాజీ సీఎం చంద్రబాబు ప్రాజెక్టు పనులను మ్యాక్స్ ఇన్‌ఫ్రా కపెంనీకి 4.77శాతం ఎక్కువకు టెండరింగ్ ఇస్తే.. అదే కంపెనీకి వైసీపీ 15శాతం తక్కువకు టెండరింగ్ ఇచ్చిందన్నారు. నవంబర్ నుంచి రివర్స్ టెండరింగ్ ద్వారా పనులు మొదలుపెడుతామని చెప్పారు. రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రభుత్వానికి ఆదాయమే తప్ప నష్టం లేదని స్పష్టం చేశారు. టీడీపీ హయాంలో జరిగిన పోలవరం పనుల్లో ప్రతీది ఖర్చు పెంచేశారని ఆరోపించారు. రూ.36వేల కోట్ల పనులు ఇంకా పెండింగ్‌లో ఉండగానే.. ప్రాజెక్టును పూర్తి చేశానని చంద్రబాబు గొప్పలు చెప్పుకున్నారని విమర్శించారు. తమవాళ్లకే టెండరింగ్స్ కట్టబెడుతున్నారని వైసీపీని చంద్రబాబు విమర్శించడం సరికాదన్నారు. నవయుగ లేదా చంద్రబాబుకు సంబంధించిన కంపెనీలు కూడా రివర్స్ టెండరింగ్‌లో పాల్గొనవచ్చునని.. తామేమీ అడ్డుపడట్లేదని చెప్పారు.

గత టీడీపీ హయాంలో 4శాతం అంచనా వ్యయం పెరిగిన ప్రతీ పనికి రివర్స్ టెండరింగ్‌ నిర్వహిస్తామన్నారు. రివర్స్ టెండరింగ్ విధానంతో టీడీపీ అవినీతి బట్టబయలు అవుతుందన్నారు. వైసీపీ విధానాలను ప్రతీ రాష్ట్రం పాటించే రోజు వస్తుందన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు,ఆయన అనుకూల మీడియా మంచి పనులపై బురద జల్లే కార్యక్రమాన్ని మానుకోవాలనుకున్నారు. మాట్లాడితే 40 ఇయర్స్ ఇండస్ట్రీ అనే చంద్రబాబు అనుభవం దేనికి పనికొచ్చిందని ప్రశ్నించారు. భగవంతుడు తమ ప్రభుత్వానికి అండగా ఉన్నాడని..అందుకే వర్షాలతో డ్యాములు కూడా నిండుతున్నాయని అన్నారు. రాష్ట్రం పచ్చగా కళకళలాడుతున్నాయన్నారు.వయసు పైబడ్డా చంద్రబాబు బుద్దిలో మార్పు రావడం లేదని.. ఇకనైనా మారాలని సూచించారు.


పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం మొత్తం రూ.55వేల కోట్లు అయితే.. ఇంకా రూ.32వేల కోట్లు పని మిగిలే ఉందని..జరిగిన పనిలోనూ ఎక్కువ శాతం వైఎస్ హయాంలోనే జరిగిందన్నారు. అలాంటప్పుడు ప్రాజెక్టును పూర్తి చేశానని చంద్రబాబు ఎలా చెబుతారని ప్రశ్నించారు.చంద్రబాబు నాయుడు జగన్‌ను చూసి ఉలికిపడుతున్నారని విమర్శించారు.
Published by: Srinivas Mittapalli
First published: September 21, 2019, 11:37 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading