చంద్రబాబు కుట్రను ఎస్ఈసీ అమలు చేశారు..మంత్రి అనిల్ ధ్వజం

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ఆపేయాలనే నీచమైన ఎత్తుగడ చంద్రబాబు వేశారని, దీన్ని ఎన్నికల కమిషనర్ అమలుచేశారని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు.

news18-telugu
Updated: March 16, 2020, 2:59 PM IST
చంద్రబాబు కుట్రను ఎస్ఈసీ అమలు చేశారు..మంత్రి అనిల్ ధ్వజం
అన్ని ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని... మూడు రాజధానులపై సీఎం జగన్ నిర్ణయాన్ని ప్రజలంతా హర్షిస్తున్నారని అన్నారు. అమరావతి అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని... అభివృద్ధి ఒకే ప్రాంతంలో కేంద్రీకృతమైతే ప్రాంతీయ అసమానతలు వస్తాయని తెలిపారు.
  • Share this:
ఏపీలో  స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదావేయడంపై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అసహనం వ్యక్తంచేశారు.  ఎన్నికలను వాయిదావేస్తూ  నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై మంత్రి తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. తన సామాజిక వర్గానికి చెందిన పార్టీ(టీడీపీ) బాగుండాలని ఎస్ఈసీ ఎన్నికలు వాయిదా వేయడం బాధాకరమన్నారు. చంద్రబాబుతో చర్చించి ఏకపక్షంగా ఎన్నికలు వాయిదా వేశారని ఆరోపించారు. కరోనా వైరస్ పేరుతో ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని ఊహించలేదన్నారు. టీడీపీకి ఎన్నికల్లో నిలబెట్టేందుకు అభ్యర్థులే దిక్కు లేరని...అందుకే నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను అడ్డం పెట్టుకుని ఎన్నికలను వాయిదావేయించుకున్నట్లు ఉందన్నారు. ఎన్నికల కమిషన్‌కు విచక్షణాధికారం పేరిట విచక్షణ కోల్పోయి నిర్ణయం తీసుకున్నారని అన్నారు.

కరోనా వైరస్ కోసం ఎన్నికలు వాయిదా వేసే ముందు రాష్ట్రంలో అధికారులను ఎవరినైనా సంప్రదించారా? అని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. అంత పెద్ద నిర్ణయం తీసుకునేముందు కనీసం ఒక సమీక్ష సమావేశం అయినా పెట్టలేదన్నారు. 45 రోజులు ఎన్నికల కోడ్ ఉందంటూ చంద్రబాబు కుట్ర పూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల కమిషనర్ కుమార్తె గతంలో ఈడీబీలో పని చేశారని...దానికి ప్రతిఫలంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారా? అన్న అనుమానం కలుగుతోందన్నారు. అందుకోసం రాష్ట్ర అభివృద్ధిని ఫణంగా పెడతారా? అంటూ నిలదీశారు.


ఎన్నికలు ఆపేసిన తర్వాత అధికారులను బదిలీ చేసే అధికారం ఎన్నికల కమిషనర్‌కు ఎక్కడిదని ప్రశ్నించారు. కరోనా కన్నా పెద్ద వైరస్ గా చంద్రబాబు తయారు అయ్యారని ధ్వజమెత్తారు. ఎన్నికలు ఆపేయాలనే నీచమైన ఎత్తుగడ చంద్రబాబు వేశారని, దీన్ని ఎన్నికల కమిషనర్ అమలుచేశారని ఆరోపించారు. ఎన్నికల కమిషనర్ ఎన్నికల వాయిదా నిర్ణయం వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పవన్ కల్యాణ్ లాంటి వాళ్లు అభ్యర్దులను నిలబెట్టే పరిస్దితి లేదని..అలాంటివాళ్ళు కూడా మాట్లాడితే ఎలా? అని ప్రశ్నించారు.ఫ్రాన్స్‌లో 5500 కరోనా కేసులు నమోదై 127 మంది చనిపోయినా అక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించారని అన్నారు. రాష్ట్రంలో అక్కడున్నంత దారుణమైన పరిస్థితులు లేవని, ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ మేరకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మంత్రి అనిల్ కుమార్ డిమాండ్ చేశారు.
Published by: Janardhan V
First published: March 16, 2020, 2:59 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading