AP MINISTER ANIL KUMAR YADAV SLAMS POWER STAR PAWAN KALYAN AND HERO NANI FOR MAKING COMMENTS ON MOVIE TICKETS FULL DETAILS PRN
AP Movie Tickets Issue:రెమ్యునేరషన్ తగ్గుతుందని వారి భయం.. పవన్, నానిపై మంత్రి అనిల్ ఫైర్..
పవన్ కల్యాణ్, నానిపై మంత్రి అనిల్ ఫైర్
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో సినిమా టికెట్ల వివాదం (Movie Tickets Issue) రానునాను తీవ్రరూపం దాల్చుతోంది. సినిమా టికెట్ల ధరలపై హీరో నాని చేసిన కామెంట్స్ పై ఏపీ మంత్రులు మండిపడుతున్నారు. తాజాగా జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. పవన్, నానిలపై ఫైర్ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో సినిమా టికెట్ల వివాదం (Movie Tickets Issue) రానునాను తీవ్రరూపం దాల్చుతోంది. సినిమా టికెట్ల ధరలపై హీరో నాని చేసిన కామెంట్స్ పై ఏపీ మంత్రులు మండిపడుతున్నారు. తాజాగా జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ (AP Minister Anil Kumar Yadav).. పవన్ కల్యాణ్ (Pawan kalyan), నాని (Hero Nani) లపై ఫైర్ అయ్యారు. టికెట్ ధరల విషయంలో గొడవ చేస్తున్న హీరోలకు వాళ్ల రెమ్యునిరేషన్ తగ్గుతుందని భయమన్నారు. పవన్ కల్యాణ్ భీమ్లానాయక్, వకీల్ సాబ్ సినిమాలకు పెట్టిన ఖర్చెంత..? పవన్ కల్యాణ్ తీసుకున్న రెమ్యునిరేషన్ ఎంతో చెప్పాలని అనిల్ ప్రశ్నించారు. ప్రజలను ఉద్దరిస్తానన్న పవన్.. తక్కువ రేటుకు వినోదం పంచొచ్చుకదా అని అన్నారు. సినిమా ప్రొడక్షన్ కాస్ట్ 30శాతం అయితే.. హీరోల రెమ్యునరేషన్ 70శాతాం ఉందన్నారు. పవన్ కల్యాణ్ తన క్రేజ్ ను అమ్ముకుంటున్నాడని అనిల్ విమర్శించారు.
ఇక హీరో నాని కామెంట్స్ పై అనిల్ ఘాటుగా స్పందించారు. తమకు ఏ నానీలు తెలయదని.. తెలిసిందల్లా కొడాలి నాని అన్న ఒక్కడేనన్నారు. సినిమాల పేరుతో జరిగే దోపిడీని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందిని ఆయన అన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుంటే సినిమాల్లో యాక్ట్ చేసే హీరోలకి ఎందుకు అంత కడుపుమంట అని అనిల్ కుమార్ ప్రశ్నించారు.
ఇక సినిమా హీరోలకు కటౌట్లు కట్టే అభిమానులంతా తాము ఎంత నష్టపోయామో భవిష్యత్తులో తెలుసుకుంటారన్న అనీల్.. తాను గతంలో హీరోలకు బ్యానర్లు, కటౌట్లు కట్టానని గుర్తు చేశారు. హీరోలకు బ్యానర్లు కడితే డబ్బు నష్టపోవడం తప్ప పెద్దగా ప్రయోజనం ఉందన్నరాయన.
ఇక గురువారం నాని చేసిన కామెంట్స్ పై మంత్రి కొడాలి నాని కూడా రియాక్ట్ అయ్యారు. ప్రభుత్వం పై కొంత మంది కక్షగట్టి ఆరోపణలు చేస్తున్నారని మంత్రి కొడాలి నాని అన్నారు. కిరణాకొట్లన్నీ లాభాల్లో ఉండవనీ... సినిమాలన్నీ లాభాల్లో ఉండవన్నారు. ఈ ఐదు రూపాయలు, పది రూపాయల టికెట్ల విధానం తమ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టలేదని.. ఎప్పటి నుంచో ఉందన్నారు. తమకు థియేటర్ల మీద, హీరోల మీద, ప్రొడ్యూసర్లపై కక్ష లేదన్నారు. కొంతమంది మాఫియాగా ఏర్పడి ప్రజలను దోపిడీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రజలకు మేలు చేసేందుకే సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు.
ఇదిలా ఉంటే ఏపీలో సినిమా థియేటర్లపై అధికారుల దాడులు కొనసాగుతన్నాయి. శుక్రవారం నాని శ్యామ్ సింగరాయ్ రిలీజ్ నేపథ్యంలో టికెట్ల ధరలపై అధికారులు దృష్టి సారించారు. ఇప్పటికే చిత్తూరులో 18, విజయనగరంలో 6, పశ్చిమగోదావరి జిల్లాలో మూడు, కడపలో 5, కృష్ణాజిల్లాలో 12 థియేటర్లను నిబంధనలు పాటించని కారణంగా సీజ్ చేశారు. టికెట్ ధరలు, అధికారుల తనిఖీల నేపథ్యంలో పలువురు ఎగ్జిబిటర్లు థియేటర్లను స్వచ్ఛందంగా మూసివేస్తున్నారు.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.