టీడీపీలో మరో వికెట్ ఔట్.. ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

టీడీపీలో మరో వికెట్ పడిపోనుందని ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు.

news18-telugu
Updated: November 28, 2019, 7:25 PM IST
టీడీపీలో మరో వికెట్ ఔట్.. ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
చంద్రబాబు, అనిల్ కుమార్ యాదవ్(ఫైల్ పోటో)
  • Share this:
ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నుంచి త్వరలోనే మరో వికెట్ పడబోతోందని ఆయన వ్యాఖ్యానించారు. కర్నూలులో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి అనిల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే టీడీపీ నుంచి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బయటకు వచ్చారు. చంద్రబాబు, లోకేశ్‌పై వంశీ తీవ్ర విమర్శలు చేయడంతో ఆయనను టీడీపీ సస్పెండ్ చేసింది. ఇప్పటికే రెండుసార్లు ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌తో భేటీ కావడంతో... ఆయన త్వరలోనే అధికారికంగా వైసీపీ కండువా కప్పుకునే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ క్రమంలోనే మంత్రి అనిల్ టీడీపీ నుంచి మరో వికెట్ పడనుందని కామెంట్ చేయడంతో... ఆ పార్టీకి గుడ్ బై చెప్పబోయే మరో ఎమ్మెల్యే ఎవరనే అంశంపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఏపీ మంత్రులు కొందరు అద్దంకి టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌తో చర్చలు జరిపారని వార్తలు వచ్చాయి. ఆయన త్వరలోనే టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలోకి వస్తారని ఊహాగానాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మంత్రి అనిల్ చెప్పిన టీడీపీ వికెట్ ఎమ్మెల్యే రవికుమారే అనే ప్రచారం మొదలైంది.


First published: November 28, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>