ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ను రైతులు అడ్డుకున్నారు. కర్నూలు జిల్లా వెళ్లిన ఆయన్ను రైతులు అడ్డుకుని నిరసన తెలిపారు. కర్నూలు జిల్లాలోని శ్రీశైలం ప్రాజెక్టు ముంపు బాధితులు గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ప్రాజెక్టు ముంపు బాధితులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారని, కానీ, ఇంతవరకు అలాంటిదేమీ జరగలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కర్నూలు జిల్లా నందికొట్కూరు దగ్గర కర్నూలు నుంచి గుంటూరు రహదారిపై వెళ్తున్న మంత్రి కాన్వాయ్‌ను అడ్డగించారు. రైతులు ఒక్కసారిగా రావడంతో మంత్రి కాన్వాయ్‌ను ఆపేశారు. అనంతరం మంత్రి కారులో నుంచి బయటకు రాగానే రైతులు ఆయన్ను చుట్టుముట్టారు. ఎన్నో సంవత్సరాలుగా తమ ఆవేదనను పట్టించుకునేవారే లేకుండా పోయారని చెప్పారు. మీరైనా పరిష్కరించాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే వద్దకు వెళ్లినా కూడా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కొందరు రైతులు.. ఏకంగా మంత్రి కాళ్ల మీద పడ్డారు. రైతులను వారించిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. వారి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.