చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డ ఏపీ మంత్రి...

టీడీపీ నేతలు తిన్నది అరగక టీడీపీ నేతలు 12 గంటలు దీక్ష చేస్తున్నారని మంత్రి అనిల్ ఆరోపించారు.

news18-telugu
Updated: April 28, 2020, 3:25 PM IST
చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డ ఏపీ మంత్రి...
చంద్రబాబు, అనిల్ కుమార్ యాదవ్(ఫైల్ పోటో)
  • Share this:
పక్క రాష్ట్రంలో కూర్చున్న చంద్రబాబుకు రాష్ట్రం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని ఏపీ మంత్రి అనిల్ మండిపడ్డారు. కరోనా కట్టడిలో ఏపీ అన్ని రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉందని.. అన్ని విధాలుగా నియంత్రణ చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా టెస్ట్‌లు నిర్వహిస్తున్నారని ఆయన వెల్లడించారు. టీడీపీ నేతలు తిన్నది అరగక టీడీపీ నేతలు 12 గంటలు దీక్ష చేస్తున్నారని మంత్రి అనిల్ ఆరోపించారు. చంద్రబాబు ఏనాడూ రైతులను ఆదుకోలేదని... పైగా కరోనా కాలంలో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తాము ల్యాబ్‌లను పెంచుతున్నామని.. మరిన్ని టెస్టులు చేస్తామన్నామని వివరించారు.

కరోనా కిట్ల కొనుగోలుపై చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆయన విమర్శలు గుప్పించారు. 63 మండలాలు మాత్రమే రెడ్ జోన్‌లో ఉన్నాయని.. ప్రభుత్వంపై చంద్రబాబు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఇలాంటి సమయంలో ధైర్యం చెప్పాల్సింది పోయి విమర్శలు చేయడం ఎంత వరకు సబబు అని మంత్రి ప్రశ్నించారు. చేతనైతే ప్రజల్లో ధైర్యాన్ని నింపండని టీడీపీ నేతలకు ఆయన సూచించారు. క్వారంటైన్‌లో అన్ని సదుపాయాలు కల్పిసున్నామన్నారు. కరోనాపై ప్రభుత్వం అప్రమత్తంగానే ఉందని అనిల్ తెలిపారు.
Published by: Kishore Akkaladevi
First published: April 28, 2020, 3:25 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading