వైసీపీ ప్రభుత్వంపై తన ట్వీట్స్ ద్వారా విమర్శలు గుప్పిస్తున్న ఏపీ మాజీమంత్రి, టీడీపీ యువనేత లోకేశ్‌పై ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. లోకేశ్ బయటకు వచ్చి మాట్లాడితే తప్పులొస్తాయని భయపడి ట్వీట్లు చేస్తున్నారని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు. లోకేశ్ ట్వీట్లు ఆయన చేస్తున్నారో... ఎవరైనా రాస్తున్నారో తెలియదని మంత్రి అనిల్ ఎద్దేవా చేశారు. సీఎం జగన్‌కు మంచి పేరు వస్తోందని లోకేశ్ భయపడుతున్నారని అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. టీడీపీలో చంద్రబాబు తర్వాతి నాయకుడు ఎవరిని ఆ పార్టీ నేతలు వెతుక్కుంటున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు ముసలివారయ్యారని... మరొకరు పులికేసి అయారని అనిల్ కుమార్ యాదవ్ ఎద్దేవా చేశారు. నెల రోజల జగన్ పాలనకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని మంత్రి అనిల్ తెలిపారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.