ఆలయాలపై దాడుల ఘటనలో ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించిన వివరాలతో టీడీపీ నేతల్లో భయం మొదలైందని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు. కొన్ని ఘటనల్లో టీడీపీ, బీజేపీ ప్రమేయం ఉన్నట్టు పోలీసు పరిశోధనలో తేలిందని అన్నారు. తమ ఉనికి కోల్పోతున్నామనే భయంతోనే కొందరు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. దాడులకు సంబంధం ఉన్న ఏ ఒక్కరిని వదిలిపెట్టబోమని వ్యాఖ్యానించారు. దేవాలయ ఘటనలతో సంబంధం ఉన్న అందరినీ అరెస్ట్ చేస్తామని అన్నారు. పోలీస్ యంత్రాంగం నిజాయితీతో కూడిన పరిశోదన చేస్తుందని.. పోలీస్ పని తీరుపై ఆరోపణలు చేయడం సరైన విధానం కాదని అన్నారు.
తొమ్మిది కేసుల్లో ఉన్నది టీడీపీ కార్యకర్తలు కాదు అని చంద్రబాబు ఎందుకు చెప్పడం లేదని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. ప్రతి కేసులో మూలాలు తీసుకుంటే టిడిపి పాత్ర స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. ఈ ఘటనకు సంబంధించి టీడీపీ, బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పోలీస్ పరిశోదన తర్వాత ఎవరు చేయించారు అనే అసలు వాస్తవాలు కూడా బయటకి వస్తాయని మంత్రి అనిల్ అన్నారు. ఒక పాస్టర్కి సంబంచిన ఘటన రెండేళ్ల క్రితం జరిగిందని.. దాన్ని ఇప్పుడు జరిగినట్టు ప్రచారం చేస్తున్నారని అన్నారు.
క్షుద్రపూజలు చేసే చరిత్ర చంద్రబాబుదని.. సీఎం జగన్ దేవుడంటే భక్తి, ప్రజలంటే గౌరవం ఉందని అన్నారు. రాష్ట్రంలో మాట సామరస్యాన్ని చెడగొట్టి దానిని రాజకీయంగా ఉపయోగించుకునే వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు అన్ని చూస్తున్నారని.. వాళ్లకు సరైన సమయంలో బుద్ధి చెబుతారని మంత్రి అనిల్ అన్నారు. సీఎం జగన్ పాలనలో గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని.. కుల, మత రాజకీయాలకు అతీతంగా సీఎం జగన్ పరిపాలన చేస్తున్నారని కొనియాడారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.