పోలవరంపై రూ. 800 కోట్లు ఆదా... టీడీపీని మూసేస్తారా... ఏపీ మంత్రి అనిల్ సవాల్

నవంబర్ నుంచి పోలవరం పనులు ప్రారంభమవుతాయని ఏపీ మంత్రి అనిల్ తెలిపారు. రెండేళ్లలో పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

news18-telugu
Updated: September 24, 2019, 11:58 AM IST
పోలవరంపై రూ. 800 కోట్లు ఆదా... టీడీపీని మూసేస్తారా... ఏపీ మంత్రి అనిల్ సవాల్
అన్ని ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని... మూడు రాజధానులపై సీఎం జగన్ నిర్ణయాన్ని ప్రజలంతా హర్షిస్తున్నారని అన్నారు. అమరావతి అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని... అభివృద్ధి ఒకే ప్రాంతంలో కేంద్రీకృతమైతే ప్రాంతీయ అసమానతలు వస్తాయని తెలిపారు.
  • Share this:
పోలవరం రివర్స్ టెండర్లతో రూ. 800 కోట్ల ప్రజాధనం ఆదా అయ్యిందని ఏపీ సాగునీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. కాలువల టెండర్లలో రూ. 58 కోట్లు మిగిలాయని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పారదర్శకంగా టెండర్ల ప్రక్రియ చేపట్టామని ఆయన చెప్పుకొచ్చారు. రూ. 4,987 కోట్ల రూపాయలు ఉండే టెండర్‌ రూ. 4,359 కోట్లకు వచ్చిందని అనిల్ వివరించారు. గతంలో తాము చేసిన దోపిడి ఎక్కడ బయటపడుతుందో అనే భయంతోనే టీడీపీ నేతలు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. టీడీపీ వెనకేసుకొస్తున్న నవయుగ కంపెనీ రివర్స్ టెండరింగ్‌లో ఎందుకు పాల్గొనలేదని ఆయన ప్రశ్నించారు. వెలిగొండ ప్రాజెక్ట్‌కు కూడా త్వరలోనే రివర్స్ టెండరింగ్ చేస్తామని అన్నారు.

నవంబర్ నుంచి పోలవరం పనులు ప్రారంభమవుతాయని అనిల్ తెలిపారు. రెండేళ్లలో పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. తాము చెప్పిన సమయానికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తే... టీడీపీని మూసేసి రాజకీయ సన్యాసం తీసుకుంటారా ? ఏపీ మంత్రి అనిల్ సవాల్ విసిరారు. డిజైన్ ప్రకరామే పోలవరం నిర్మాణం జరుగుతుందని... ఎత్తు తగ్గించబోమని స్పష్టం చేశారు. దేవినేని కూర్చుని మాట్లాడిన స్థలం కూడా ఇరిగేషన్‌ శాఖదే అని మంత్రి అనిల్ అన్నారు. ఏడాదికి రూ. వెయ్యి లీజ్‌తో ఉంటూ నిజాయితీ గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తాము రివర్స్ టెండరింగ్‌కు వెళ్లకపోతే... ఆ డబ్బు టీడీపీ జేబులోకి వెళ్లేదని ఆరోపించారు.
Published by: Kishore Akkaladevi
First published: September 24, 2019, 11:58 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading